విజయనగరంలో కుక్కల స్వైర విహారం: రాజాంలో మహిళపై దాడి.. భయం గుప్పిట్లో జనం!
విజయనగరం జిల్లాలో కుక్కలు స్వైర విహారం చేస్తున్నాయి. దాదాపు అన్ని ప్రాంతాల్లో గుంపులు గుంపులుగా తిరుగుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. మనుషులతో పాటు పశువులపై దాడి చేసిన సందర్భాలూ లేకపోలేదు. మెయిన్ రోడ్లపైకి వచ్చి బైకర్ల వెంట పడుతుండడతో వారు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఈరోజు కూడా రాజాంలో ఓ మహిళపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి.