తెలంగాణలో భారీగా ఐపీఎస్ అధికారుల బదిలీలు..!
- యువ ఐపీఎస్‌లకు ట్రాఫిక్ విభాగంలో కీలక బాధ్యతలు.
- రాష్ట్రలో 10 ఐపిఎస్ లు బదిలీ, కీలక విభాగాల్లో బాధ్యతలు స్వీకరించనున్న అధికారులు.
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వం భారీ ఎత్తున ఐపీఎస్ అధికారుల బదిలీలు చేపట్టింది. కీలక విభాగాల్లో అనుభవం కలిగిన అధికారులతో పాటు యువ ఐపీఎస్‌లకు కూడా ప్రాధాన్యతనిస్తూ కొత్త బాధ్యతలు అప్పగించింది.
1.లాజిస్టిక్స్ ఐజీగా గజరావు భూపాల్.
2.విజిలెన్స్ డీఐజీగా అభిషేక్ మహంతి.
3.సీఐ సెల్ డీఐజీగా ఆర్. భాస్కరన్
4.ఫ్యూచర్ సిటీ అడిషనల్ సీపీగా చందన దీప్తి.
5.సైబరాబాద్ డీసీపీ (అడ్మిన్)గా అన్నపూర్ణ.
6.డీసీపీ రాహుల్ హెగ్దేకు ట్రాఫిక్-3 బాధ్యతలు.
7.ఇంటెలిజెన్స్ ఎస్పీగా అపూర్వారావు
8.విజిలెన్స్ ఎస్పీగా ఈస్ట్‌జోన్ డీసీపీ బాలస్వామి
9.సీఐడీ ఎస్పీగా వెంకటేశ్వర్లు
10.క్రైమ్స్ డీసీపీగా చైతన్యకుమార్
ట్రాఫిక్ వ్యవస్థను మరింత సమర్థవంతంగా తీర్చిదిద్దే లక్ష్యంతో యువ ఐపీఎస్ అధికారులకు కీలక పోస్టులు కేటాయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.