logo

కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్ పీర్

కడప నగర సమస్యల పరిష్కారం కోసం తమ పోరాటం

కాంగ్రెస్ సిటీ ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్ పీర్

కడప జనవరి 17 : నిత్యం నగర ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరి ష్కారానికి తమ పోరాటం కొనసాగిస్తామని కాంగ్రెస్ పార్టీ సిటీ ప్రెసిడెంట్ సయ్యద్ గౌస్ పీర్ వెల్లడించా రు. నూతనంగా ఎన్నికైన సందర్భం గా శనివారం ఇందిరా భవన్ నందు మీడియా
తో ఆయన ముచ్చ టించారు. కడపలో ప్రధానంగా రెండు సమస్యలు అనగా అభివృద్ధి మరియు సంక్షేమం సమస్యలు ఉన్నాయని చెప్పా రు.అందులో డ్రైనేజీ, మురికి కాలువలు సరిగా లేకపో వడం వల్ల వర్షాకాలంలో ఆ మురికి నీరు రోడ్డు పైకి వచ్చి ప్రజలకు ఇబ్బంది కలిగిస్తుందని చెప్పారు. గ తంలో తమ కాంగ్రెస్ పార్టీ హయాం లో చేసిన అభివృద్ధే కనిపిస్తుంది తప్ప ఇప్పుడొ చ్చిన ప్రభుత్వాలు ప్రజా సమస్య లను పట్టించుకున్న పాపాన పోలేద ని విమర్శించారు. నగరం లోని రోడ్లు గుంతలు పడి శిధిలావస్థలో ఉన్న ప్రస్తుత ప్రభు త్వం పట్టించుకోవడం లేదని ధ్వజమెత్తారు.ఈ గుంతల రోడ్లతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని ఆవేదన వ్యక్తం చేశా రు.ప్రజా సమస్యల పట్ల చిత్తశుద్ధి తో పోరాడటానికి సిద్ధమన్నారు.ఎండాకాలంలో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంటుందని, ప్రజలకు తాగునీరు అందించేందుకు ప్రజా ప్రతినిధులు ముందుగా చర్యలు తీసుకొని దానిని పరిష్కరించేం దుకు కృషి చేయకపోతే మూల్యం చెల్లించాల్సి ఉంటుందని చెప్పా రు. అంతే కాకుండా నగరం లో అర్హు లైన పేదలకు సంక్షేమ పథకాలు అంద డం లేదని ఆరోపిం చారు.కూ టమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు పూర్తి కావస్తున్నా పేదల బతుకులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైందని మండిప డ్డారు. తాము పేదల పక్షాన నిలబడి మాట్లాడలేని బడుగు జీవుల గొంతుకై పెద్ద ఎత్తున ఉద్యమి స్తామని చెప్పారు. రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎండగ ట్టి.ప్రజా ప్రతినిధుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా పోరాడటం చేస్తామని చెప్పారు. నగరంలోని 50 డివిజన్లు లో తమ పార్టీ పోటీ చేసి కనీసం 30 డివిజన్లు లో విజయకేతనం ఎగురవేస్తామని చెప్పారు.

9
394 views