logo

దార గంగవరంలో జనసేన నాయకుల ఆధ్వర్యంలో సంక్రాంతి సందర్భంగా ఎడ్ల బండ్ల పోటీలు

అనకాపల్లి జిల్లానర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం దార గంగవరం గ్రామంలో జనసేన నాయకులు సంక్రాంతి పండుగ పురస్కరించుకొని ఎడ్ల బండ్ల పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని జనసేన నాయకుడు ప్రగడ కృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. జనసేన నర్సీపట్నం ఇంచార్జ్ రాజన్న సూర్య చంద్ర ముఖ్య అతిథిగా హాజరై పోటీలను ప్రారంభించారు. పోటీల్లో గెలిచిన నిర్వాహకులకు మొదటి, రెండవ, మూడవ స్థానాలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో తాండవ చైర్మన్ కరక సత్యనారాయణ, స్థానిక ఎస్సై తారకేశ్వరరావు, జనసేన నాయకులు పాల్గొన్నారు. ప్రథమ బహుమతి: రేవల్ల గ్రామానికి చెందిన పంచాడ వెంకట్రావు 12 వేల రూపాయలురెండవ బహుమతి: కూండ్రం గ్రామానికి చెందిన మంగి మాంబ 10 వేల రూపాయలు, మూడవ బహుమతి: ఎం.కోటపాడు గ్రామానికి చెందిన పాసిల రవి - 8 వేల రూపాయలు నాలుగవ బహుమతి రేవల్ల గ్రామానికి చెందిన శ్రీ ఆంజనేయం జట్టు , 6 వేల రూపాయలుఐదవ బహుమతి: చోడవరం గ్రామానికి చెందిన రాయపు రెడ్డి శ్రీను - 4 వేల రూపాయలుసంక్రాంతి పండుగ సందర్భంగా ఈ కార్యక్రమం గ్రామవాసులలో గొప్ప ఉత్సాహాన్ని రేకెత్తించింది.

15
797 views