logo

రోలుగుంట మండలం కంచుగుమ్మలలో సంక్రాంతి సందర్భంగా మహిళల ముగ్గుల పోటీలు.

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కంచుగుమ్మల గ్రామంలో వేణుగోపాలస్వామి గుడి ఆవరణలో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గ్రామానికి చెందిన సుమారు 40 మంది మహిళలు ఉత్సాహంగా పాల్గొని, అందమైన రంగుల రంగవల్లులతో తమ సృజనాత్మకతను ప్రదర్శించారు. ఈ కార్యక్రమం హైందవ సంప్రదాయాల గొప్పతనాన్ని తెలియజేస్తూ, సంక్రాంతి పండుగ శోభను మరింత పెంచింది.ఈపోటీలకు జడ్జిలుగా రోలుగుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల లో ఆంగ్ల ఉపాధ్యాయురాలు గా పని చేస్తున్న శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి, రిషి కాలేజీ కరస్పాండెంట్ శ్రీ కోన సతీష్, డాన్ బాస్కో కాలేజ్ కెమిస్ట్రీ లెక్చరర్ శ్రీ ఓ. సత్యనారాయణ, శ్రీ చిరంజీవి, శ్రీ రాజారావు వ్యవహరించారు. ముఖ్య అతిథులుగా శ్రీమతి పి.వి.ఎం. నాగజ్యోతి, రోలుగుంట ఎస్సై శ్రీ జి. రామకృష్ణ హాజరయ్యారు పోటీలలో గెలుపొందిన వారికి :మొదటి బహుమతి: గ్రైండర్ రెండవ బహుమతి, కూలర్ మూడవ బహుమతి, మిక్సీ నాలుగవ బహుమతి: డైనింగ్ సెట్ . పాల్గొన్న ప్రతి మహిళకు చీరలు బహూకరించారు. ముఖ్య అతిథి శ్రీమతి నాగజ్యోతి మాట్లాడుతూ, “ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఆనందం. మహిళల ప్రతిభ అద్భుతం. ఇలాంటి కార్యక్రమాలు సంప్రదాయాలను తరతరాలకు చేరవేస్తాయి” అని అన్నారు. ఎస్సై రామకృష్ణ కూడా మహిళల సృజనాత్మకతను ప్రశంసించారు.గ్రామస్తులు ఈ కార్యక్రమం ద్వారా సంక్రాంతి ఉత్సవాలు మరింత రసవత్తరంగా మారాయని హర్షం వ్యక్తం చేశారు. హైందవ ధర్మ సంప్రదాయాల ప్రచారానికి ఇది మైలురాయిగా నిలిచింది.

0
775 views