logo

తెలుగు సినీ నటుడు, సంక్రాంతి పండుగ సందర్భంగా హాస్యనటుడు సప్తగిరి పలమనేరు SVCR డిగ్రీ కళాశాల గ్రౌండ్ నందు క్రికెట్ ఆడారు

సంక్రాంతి పండుగ సందర్భంగా పలమనేరు SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ నందు సరదాగా క్రికెట్ ఆడిన 'సప్తగిరి'( వెంకట ప్రభు ప్రసాద్) సినీ నటుడు, హాస్యనటుడు.
పండుగ సందర్భంగా తన స్వగ్రామానికి విచ్చేసి అక్కడి నుండి పలమనేరు నందు నిర్వహిస్తున్న క్రికెట్ టోర్నమెంట్ కు మిత్రులతో కలసి SVCR గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్కు విచ్చేశారు. అక్కడ క్రికెట్ ఆడుతున్న క్రీడాకారులతో సుమారు రెండు గంటల సేపు క్రికెట్ ఆడుతూ, ఉత్సాహపరుస్తూ తాను కూడా ఆస్వాదిస్తూ సంతోషించారు. అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు.
తెలుగు 'పరుగు' సినిమా (అల్లు అర్జున్ హీరోగా) సప్తగిరికి మంచి గుర్తింపు తెచ్చింది.
'ప్రేమ కథా చిత్రమ్', 'ఎక్స్‌ప్రెస్ రాజా', 'సోగ్గాడే చిన్ని నాయనా', 'మనం', 'దృశ్యం', 'పవర్' వంటి అనేక చిత్రాలలో నటించారు.

3
623 views