logo

కోళ్ల పందెం ఆటగాళ్లు అరెస్ట్... కోళ్లు నగదు, మోటార్ బైకులు సీజ్.

నమస్కారం సార్

నంద్యాల జిల్లా రుద్రవరం మండలంలో కోడి పందాలాటరాయుళ్లు అరెస్ట్ అయ్యారు. కోడి పందాలు నిషేధం విధించిన ఎస్పీ సూచనల మేరకు మరియు ఆళ్లగడ్డ డిఎస్పి ఆదేశాల మేరకు సిరివెళ్ల సి.ఐ సూచనలతో రుద్రవరం ఎస్సై జయప్ప తన సిబ్బందితో గురువారం నాడు కోడి పందాలు ఆడుతున్నారన్న సమాచారం తెలిసిన వెంటనే T .లింగం దిన్నె గ్రామ పొలిమేరలో గొడుగు ఓబులేష్ పొలం దగ్గర కోడిపందెం ఆడుతున్న వారిపై మెరుపు దారి చేయగా సూర్యనారాయణ మరియు రమణ అను ఇద్దరు వ్యక్తులు పారిపోగా తొమ్మిది మంది ని వెంబడించి అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ 20వేల 150 రూపాయలు మరియు మూడు పందెం కోళ్లు మరియు ఏడు మోటర్ బైక్ లను సీజ్ చేసి రుద్రవరం పోలీస్ స్టేషన్కు తరలించి కేసు నమోదు చేయడమైనదనీ, పారిపోయిన సూర్యనారాయణ మరియు రమణా అను వారిని కూడా అరెస్టు చేస్తామన్నారు. ఎవరైనా సరే సంక్రాంతి పండుగ సందర్భంగా కోడి పందాలు ఇతరు జూదాలు అసాంఘిక కార్యకలాపాలు నిర్వహించినట్లయితే చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై తెలియజేశారు.

281
10571 views