
ఈ నెల 16 న నిర్మల్ జిల్లాకి సీఎం రాక.
సీఎం సభా ప్రాంగణం, సదర్ మాట్ ప్రాజెక్ట్ ని పరిశీలించిన రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు,ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రివర్యులు,నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు & ఖానాపూర్ శాసనసభ్యులు !
ఈ నెల 16 వ రోజున నిర్మల్ జిల్లా మామడ మండలం పొన్కల్ గ్రామానికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రివర్యులు ఎనుముల రేవంత్ రెడ్డి రానున్న సందర్బంగా జిల్లా కేంద్రంలోని సభా ప్రాంగణం ఎన్టీఆర్ మిని స్టేడియంను, సదర్ మార్ట్ ప్రాజెక్ట్ ని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారులు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి,ఉమ్మడి జిల్లా ఇంచార్జీ మంత్రివర్యులు జుప్పాలి కృష్ణ రావు, నిర్మల్ జిల్లా డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ శాసనసభ్యులు వెడ్మ బొజ్జు పటేల్ ,నిర్మల్ నియోజకవర్గ ఇంచార్జీ కూచాడి శ్రీహరి రావు పరిశీలించారు.
మామడ మండలం పొన్కల్ గ్రామం గోదావరి నదిపై నిర్మించిన సదర్ మార్ట్ బ్యారేజ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభిస్తారని అనంతరం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగే సభలో పాల్గొంటారని వారు తెలిపారు.
ఈ సమావేశంలో నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్,ఎస్పీ జానకి షర్మిల, ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్, వివిధ శాఖల అధికారులు, నియోజకవర్గ నాయకులు, మండల నాయకులు, కార్యకర్తలు,తదితరులు పాల్గొన్నారు.