logo

సంక్రాంతి సందర్భంగా నర్సీపట్నం సనా సెంటర్‌లో ఉచిత చెకప్ క్యాంప్

నర్సీపట్నం, జనవరి 14: సంక్రాంతి పండుగ సంతోషంలో నర్సీపట్నం సనా స్పీచ్ ఇయర్ రింగ్ అండ్ రిహాబిలిటేషన్ సెంటర్ ప్రజలకు గొప్ప బహుమతి ప్రకటించింది. డాక్టర్ ఎన్. మస్తాన్‌వలి, రాజేశ్వరి (ఆడియాలజిస్టులు & స్పీచ్ తెరపిస్టులు) లు ఆధ్వర్యంలో ఉచిత వినికిడి, స్పీచ్ చెకప్ క్యాంప్ మొదలైంది. జనవరి 14 నుంచి 19 వరకు పూర్తిగా ఉచిత సేవలు అందిస్తారు.
ఈ క్యాంప్‌లో పిల్లలు, పెద్దలు, వృద్ధులకు వినికిడి పరీక్షలు, మాట్లాడట సమస్యల అంచనా, హియరింగ్ ఎయిడ్ తనిఖీలు, థెరపీ సలహాలు అందిస్తారు. పేదలకు, గ్రామీణ ప్రజలకు ప్రాధాన్యత. రోజుకు 50 మందికి పైగా సేవలు చేసేందుకు సిద్ధం.
డాక్టర్ మస్తాన్‌వలి మాట్లాడుతూ, "గత 5 ఏళ్లుగా అనకాపల్లి పరిసరాల్లో పేదలకు ఉచిత సేవలు చేశాం. ఇప్పుడు నర్సీపట్నం, చింతపల్లి ప్రాంతాల్లో విస్తరిస్తున్నాం. సంక్రాంతి సమయంలో మీ వినికిడి, మాట సమస్యలు తనిఖీ చేయించుకోండి. ముందు తెలుసుకుంటే సులువుగా పరిష్కారం" అన్నారు.
రాజేశ్వరి మాట్లాడుతూ, "పిల్లల్లో మాట ఆలస్యం, ఆటిజం సమస్యలకు ప్రత్యేక చికిత్సలు. వృద్ధుల వినికిడి బలహీనతకు పరిష్కారాలు. 50 కి.మీ.లోపు ప్రజలు రిజిస్టర్ చేసుకుని వచ్చి ప్రయోజనం పొందండి." స్థానికులు సెంటర్ సేవలను కొనియాడారు. "డాక్టర్లు దేవుళ్ల మాదిరిగా పేదలకు సేవ చేస్తున్నారు. మా పిల్లలు బాగుపడ్డారు" అని గ్రామస్తులు ఆనందంగా తెలిపారు.

2
891 views