logo

సామూహిక ఎలుకల నివారణతో దిగుబడులు పెంచాలి: జిల్లా కలెక్టర్ శ్రీమతి జి. రాజకుమారి.

నంద్యాల (AIMA MEDIA): వ్యవసాయ శాఖ అధికారులు రైతుల సేవలో నిబద్ధతతో పనిచేసి వారిని ప్రగతి పథంలో ముందుకు నడిపించాలని జిల్లా కలెక్టర్ జి రాజకుమారి సూచించారు. మంగళవారం కలెక్టర్ ఛాంబర్ లో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ అధికారుల సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన డైరీ, క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మాట్లాడుతూ రైతుల సేవలో వ్యవసాయ అధికారులు నిబద్దతతో పని చేయాలన్నారు. డైరీలో పొందుపరిచిన క్వాలిటీ కంట్రోల్ నిబంధనల ప్రకారం నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు రైతులకు అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎలుకల నివారణకు సంబంధించిన పాంప్లెట్లు, పోస్టర్లను విడుదల చేశారు. పంట విత్తనం నుంచి కోత వరకు ఎలుకల వల్ల నష్టం జరుగుతున్నందున రైతులు సామూహిక ఎలుకల నివారణ కార్యక్రమంలో పాల్గొని మెరుగైన దిగుబడులు, అధిక లాభాలు పొందాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి నున్న వెంకటేశ్వర్లు, వ్యవసాయ అధికారులు మరియు ఏపీ వ్యవసాయ అధికారుల సంఘ ప్రతినిధులు పాల్గొన్నారు.

5
157 views