logo

పొలాల్లో సంక్రాంతి శోభ. రైతులు, కూలీలతో సరదాగా గడిపిన ఎమ్మెల్యే పరిటాల సునీత.

పొలాల్లో సంక్రాంతి శోభ.
రైతులు, కూలీలతో సరదాగా గడిపిన ఎమ్మెల్యే పరిటాల సునీత.రైతుల పొలాలకు వెళ్లి అనపకాయలు కొన్న ఎమ్మెల్యే.

రాప్తాడు నియోజకవర్గంలోని రైతుల పొలాల్లో సంక్రాంతి శోభ కనిపిస్తోంది. రైతులు పండించిన పంటను మార్కెట్ కు తరలిస్తూ బిబీబిజీగా కనిపించారు. ముఖ్యంగా సంక్రాంతి పండుగలో భాగమైన అనపకాయల తోటలు రామగిరి, చెన్నేకొత్తపల్లి, కనగానపల్లి మండలాల్లో ఎక్కువగా సాగు చేస్తున్నారు. ఎమ్మెల్యే సునీత పండుగ సందర్భంగా రైతుల పొలాల వద్దకు వెళ్లి వారిని పలుకరించారు. గంగంపల్లి దగ్గర రైతు కురుబ లక్ష్మన్న పొలానికి వెళ్లి అక్కడ అనపకాయలు కొన్నారు. రైతులతో పంట దిగుబడులు, ధరలు గురించి ఆరా తీశారు. మరోవైపు కూలీలతో కూడా మాట్లాడుతూ పంటను, దిగుబడుల్ని పరిశీలించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గ్రామాల్లో సంక్రాంతి కళ కనిపిస్తోందన్నారు. భోగి రోజు ప్రధానంగా వండే అనపకాయలు రైతుల పొలాల వద్ద కొనడం చాలా సంతోషంగా ఉందన్నారు. రైతులకు అన్ని విధాలుగా ఈ ప్రభుత్వం అండగా ఉంటుందని.. అన్ని వర్గాలవారు ముఖ్యమంత్రి చంద్రబాబు పాలనలో సంతోషంగా ఉన్నారన్నారు.

3
69 views