logo

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి డిఆర్ఓ మలోలా అనంతపురం

ఇంటర్ పరీక్షలను సజావుగా నిర్వహించండి
డిఆర్ఓ మలోలా. జనవరి 21 నుండి జిల్లా వ్యాప్తంగా ప్రారంభమవుతున్న ఇంటర్మీడియట్ పరీక్షలను సజావుగా నిర్వహించే విధంగా సంబంధిత శాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకొని ఇంటర్ పరీక్షలను విజయవంతం చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి మలోల ఆదేశించారు.
సోమవారం రెవెన్యూ భవన్ సమావేశ మందిరంలో ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణపై వివిధ శాఖ అధికారులతో డిఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించి పలు సూచనలు ఆదేశాలు జారీ చేశారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇంటర్ పరీక్షల నిర్వహణ ప్రక్రియ విజయంతో మొదటకు ఆయా శాఖ అధికారులు సమన్వయంతో పనిచేయాలని పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్ల కొరకుముందస్తుచర్యలుతీసుకొని పూర్తి చేయాలన్నారు.
జనవరి 21వ తేదీన ఎథిక్స్ మరియు హ్యూమన్ వాల్యూస్ 23న ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ పరీక్షలు ఉదయం 10 నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయని తెలిపారు. 20 పరీక్ష కేంద్రాలలో ఒకేషనల్ ప్రాక్టికల్ పరీక్షలు జనవరి 27 నుండి ఫిబ్రవరి 10వ తేదీ వరకు 15 రోజులు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటలవరకుఆదివారాలలో
కూడా ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించబడుతున్నట్లు డిఆర్ఓ పేర్కొన్నారు. అలాగే 83 పరీక్ష కేంద్రాలలో జనరల్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 1 నుండి 10వ తేదీ వరకు పది రోజులు ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు మరియు మధ్యాహ్నం రెండు గంటల నుండి 5 గంటల వరకు ఆదివారాలలో కూడా ప్రాక్టికల్ పరీక్షలు జరుగుతాయని జిల్లావ్యాప్తంగా 9900 మంది విద్యార్థులు ప్రాక్టికల్స్ పరీక్షలకు హాజరవుతున్నట్లు తెలిపారు. అలాగే 64 థియరీ పరీక్షలు కేంద్రాలలో 48 146 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరవుతున్నారని ఈ తీరి పరీక్షలు ఫిబ్రవరి 23 నుండి మార్చి 24 వరకు ఉదయం తొమ్మిది గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు జరుగుతాయని 64 పరీక్ష కేంద్రాలలో అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయవలసిందిగా డిఆర్ఓ సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. విద్యార్థుల పరీక్ష కేంద్రమునకు అరగంట ముందే చేరుకోవాల్సి ఉంటుందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆధ్వర్యంలో ఆయా కేంద్రాలలో ప్రథమ చికిత్స వివరాలు ఏర్పాటు చేయాలని అదేవిధంగా సమయానికి పరీక్ష కేంద్రాలకు విద్యార్థులు చేరుకునే విధంగా ఏపీఎస్ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అలాగే ఆయా పరీక్ష కేంద్రాలలో త్రాగునీరు తగినంత గాలి నిరంతర విద్యుత్ సరఫరా ఇతర మౌలిక సదుపాయాలు తదితర వంటివి సౌకర్యాలు కల్పించాలని ఆదేశించారు. కార్మిక శాఖ ద్వారా పరీక్ష జరిగే రోజులలో జిరాక్స్ సెంటర్ లను మూసివేసే విధంగా ఉప కమీషనర్ కార్మిక శాఖ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
జనవరి 27 నుండి ఫిబ్రవరి 10 వరకు ఉదయం ఎనిమిది గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు ఆయా పరీక్ష కేంద్రాలలో విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో నిరంతర విద్యుత్ సరఫరా ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ ఆదేశించారు. ప్రాక్టికల్ పరీక్షలు మరియు థియరీ పరీక్షలను సీసీ కెమెరాల పర్యవేక్షణలో నిర్వహించాలని పరీక్షలు సజావుగా నిర్వహించుటకు పోలీసు రెవెన్యూ ఇంటర్ విద్యా, పోస్టల్ కార్మిక, ఐ అండ్ పి ఆర్ తదితర శాఖ ల అధికారులు సమన్వయ సహకారాలతో పరీక్షల నిర్వహణ పకడ్బందీగా సజావుగా జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ప్రాంతీయ పర్యవేక్షణాధికారి వెంకటరమణ నాయక్, వృత్తి విద్యాశాఖ అధికారి గురువయ్య పరీక్షల నిర్వహణ కమిటీ సభ్యులు శ్రీమతి నాగరత్నమ్మ , కృష్ణమూర్తి వెంకటస్వామి వైద్య ఆరోగ్య కార్మిక పోలీసు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు

8
833 views