logo

ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మొత్తం 6,92,020 రూపాయల విలువైన చెక్కులు



ఆంధ్రప్రదేశ్ గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాలు మరియు సహకారంతో, సోమవారం అనంతపురం పట్టణంలోని ఎంపీ క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి సహాయ నిధి (CMRF) కింద మొత్తం 6,92,020 రూపాయల విలువైన చెక్కులను అనంతపురం పార్లమెంట్ సభ్యులు అంబిక లక్ష్మీనారాయణ అర్హులైన లబ్ధిదారులకు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా బుక్కరాయసంద్రం మండలానికి చెందిన ఎర్రి నాగప్ప హృదయ సంబంధిత అనారోగ్యంతో బాధపడుతూ ఆర్థికంగా వెనుకబడిన ఎర్ర స్వామి గారికి CMRF కింద ₹61,441/- ఆర్థిక సహాయం అందించారు. గుంతకల్లు పట్టణానికి చెందిన శ్రీ దేవేంద్ర గారు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకోవాల్సిన పరిస్థితిలో ఉండగా, సీఎం సహాయ నిధి కింద ₹3,91,197/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది. తాడిపత్రి పట్టణానికి చెందిన చంద్ర అనారోగ్య కారణంగా మృతి చెందగా, వారి కుటుంబానికి CMRF కింద ₹1,64,280/- ఆర్థిక సహాయం అందించారు. సింగనమల మండలానికి చెందిన కృష్ణారెడ్డి అనుకోని ప్రమాదంలో స్నేక్ బైట్ కు గురై, ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులో చికిత్స పొందిన నేపథ్యంలో CMRF కింద ₹75,102/- ఆర్థిక సహాయం అందించడం జరిగింది.
ఈ సందర్భంగా లబ్ధిదారులు మరియు వారి కుటుంబ సభ్యులు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఎంపీ అంబిక లక్ష్మీనారాయణకి తమకు అండగా నిలిచినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
పేదలు, నిరుపేదలు, అనారోగ్యంతో బాధపడుతున్న కుటుంబాలకు ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా అవసరమైన ప్రతి ఒక్కరికీ సహాయం అందేలా కృషి చేస్తున్నామని ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ ఈ సందర్భంగా తెలిపారు.

5
224 views