
అనంతపురం జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల
*అనంతపురం జిల్లా*
*కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్*
* అనంతపురం జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ ను విడుదల చేశారు. ఈ మేరకు ఎస్.ఎస్.ఏ అదనపు ప్రాజెక్ట్ సమన్వయకర్త టి.శైలజ, జేసీడీఓ కవిత సంయుక్తంగా పత్రికలకు ఒక ప్రకటన శనివారం విడుదల చేశారు. కస్తూర్బా బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న భోదన, భోధనేతర సిబ్బంది పోస్టులను ఔట్ సోర్సింగ్ (పొరుగు సేవల ) ప్రాతిపదికన భర్తీ చేస్తున్నట్లు వివరించారు. ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఆయా పోస్టులకు ఆసక్తి కలిగిన మహిళా అభ్యర్థుల నుంచి ఈ నెల 12 నుంచి 23వ తేదీ వరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు వెల్లడించారు.
*జిల్లా వ్యాప్తంగా 72 ఖాళీలు*
* జిల్లాలో టైపు-3, టైపు-4 కేజీబీవీలకు సంబంధించి 72 ఖాళీ పోస్టులు ఉన్నట్లు తెలిపారు. వాటికి మాత్రమే దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వివరించారు.
*ఏయే పోస్టులంటే..*
* ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్, ఏఎన్ఎం, అకౌంటెంట్, పార్ట్ టైం టీచర్స్, వార్టన్ పోస్టులు జిల్లా యూనిట్ గా భర్తీ చేస్తామని తెలిపారు.
* కుక్, హెడ్ కుక్, స్వీపర్, స్కావెంజేర్, డే/నైట్ వాచ్ ఉమెన్, చౌకిదార్ పోస్టులు మండల యూనిట్ గా పరిగణించి ఎంపిక చేస్తామని వివరించారు.
* పై పోస్టులకు సంబంధించిన దరఖాస్తు నమూనా, విద్యార్హత వివరాలు, గౌరవ వేతనం, కేజీబీవీల వారీగా ఖాళీ పోస్టుల సంఖ్య, ఖాళీల రోస్టర్ పాయింట్లు ఇతర వివరాలు సమగ్రంగా http://samagrashikshaatp.blogspot.com వెబ్ సైట్ లో పొందుపరచినట్లు వారు తెలిపారు. కేవలం నోటిఫై చేసిన ఖాళీ పోస్టులకు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని స్పష్టం చేశారు. పూర్తి చేసిన దరఖాస్తులు, అర్హతలకు సంబందించిన స్టడీ సర్టిఫికెట్లు(నాల్గో తరగతి నుంచి పదో తరగతి వరకు), ఆధార్, కుల ధృవీకరణ కాపీలపై గజిటెడ్ అధికారితో అటేస్టేడ్ చేయించి ప్రతి పోస్టుకు విడివిడిగా దరఖాస్తునకు జతపరచాలని సూచించారు. మండల యూనిట్ గా పరిగణించే పోస్టులకు ఆ మండల విద్యాశాఖాధికారి కార్యాలయములో, జిల్లా యూనిట్ గా పరిగణించే పోస్టులకు సమగ్ర శిక్ష కార్యాలయం లెనిన్ నగర్, టి.వి.టవర్ దగ్గర, అనంతపురము కార్యాలయంలో అందజేయాలని సూచించారు. ఈ నెల 23వ తేదీ సాయంత్రము 5.00 గంటల లోపల సమర్పించాలని స్పష్టం చేశారు. గడువు ముగిసిన తరువాత వచ్చిన దరఖాస్తులు స్వీకరించేది లేదన్నారు.