logo

ప్రజలకు భోగి, సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపిన ‘చిన్న శ్రీను’.. పాడిపంటలతో పల్లెలు వర్ధిల్లాలని ఆకాంక్ష

ఉమ్మడి విజయనగరం జిల్లా పరిషత్ చైర్మన్, వైఎస్ఆర్సీపీ జిల్లా పార్టీ అధ్యక్షులు మరియు భీమిలి నియోజకవర్గం సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను)* ప్రజలందరికీ భోగి, మకర సంక్రాంతి మరియు కనుమ పండుగల సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగువారి సంస్కృతి సంప్రదాయాలకు ప్రతిబింబమైన సంక్రాంతి పండుగ ప్రతి ఇంట్లో సరికొత్త వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.
రైతు పండించిన పంట చేతికి వచ్చే ఈ శుభసమయంలో, పల్లెటూర్లన్నీ పాడిపంటలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు.
ప్రజలందరూ ఈ సంక్రాంతి సంబరాలను సుఖసంతోషాల మధ్య జరుపుకోవాలని, ఈ పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో కొత్త ఉత్సాహాన్ని, విజయాన్ని తీసుకురావాలని ఆయన ఆకాంక్షించారు.

1
806 views