logo

ఏపీలో మద్యం ధరల పెంపు!*

జర్నలిస్ట్ : మాకోటి మహేష్

అమరావతి:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మద్యం ధరలను పెంచింది క్వార్టర్ రూ"99 ఉన్నవి మినహా మిగతా అన్ని రకా ల బ్రాండ్లపై పరిణామంతో సంబంధం లేకుండా రూ"10 చొప్పున పెంచింది,బీరు, వైన్ రెడీ టూ డ్రింకుల ధరలు మాత్రం పెంచలేదు..

ఈ మేరకు ఎక్సైజ్‌ శాఖ ముఖ్య కార్యదర్శి ఎంకే మీనా, ఉత్తర్వులు జారీచేశారు.దీంతో ఏటా రూ.1,391 కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. బార్లు, మద్యం షాపుల్లో వేర్వేరు ధరలు ఉండటంతో అదనపు రిటైల్ ఎక్సైజ్ పన్నును ఉపసంహ రించాలని నిర్ణయించింది.

దీంతో బార్లు, మద్యం షాపుల్లో ధరలు ఒకేలా ఉండే అవకాశం ఉంది. ఐఎంఎఫ్‌ఎల్‌తో పాటు ఫారిన్‌ లిక్కర్‌కు ఈ ధరల పెంపు వర్తిస్తుంది. అలాగే, వైన్స్‌ షాపుల లైసెన్సీలకు ఇచ్చే లాభాన్ని ఒక శాతం పెంచింది. మద్యం ధరల వ్యత్యాసాన్ని సవరించాలం టూ బార్ల యజమానులు ఏపీ ప్రభుత్వాన్ని కోరడంతో ప్రభుత్వం అందుకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది.

మరోవైపు అప్పటికప్పుడు బీరు తయారుచేసి అమ్మే మైక్రో బ్రూవరీ పాలసీ నిబంధనలను కూడా ఎక్సైజ్‌ శాఖ సవరించింది. మున్సిపల్‌ కార్పొరేషన్ల వెలుపల ఐదు కి.మీ. పరిధి వరకు త్రీస్టార్‌ లేదా అంతకంటే పెద్ద హోటళ్లలో మైక్రోబ్రూవరీలను ఏర్పాటు చేస్తున్నారు.

4
251 views