logo

సంక్రాతి పండుగకి ఉరికెళ్తున్నారా...జాగ్రత్త.. - పోలీస్ వారి సూచనలు పాటించండి : గోదావరిఖని వన్ టౌన్ సీఐ ఇంద్రసేన రెడ్డి

గోదావరిఖని, జనవరి 13, తెలంగాణ రిపోర్టర్(దినేష్) : సంక్రాతి పండుగ సందర్భంగా సెలవులను పురస్కరించుకొని సొంత ప్రాంతాలకు, బంధువుల ఇండ్లకి, విహార యాత్రలకు వెళ్లే ప్రజలు, ఆపార్టుమెంట్ వాసులు దొంగతనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని గోదావరిఖని వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఇంద్రసేన రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. చోరీల నియంత్రణకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. ఈ సమయంలో గోదావరిఖని వన్ టౌన్ పరిధి ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరించాలని తెలిపారు.
ప్రజలకు గోదావరిఖని వన్ టౌన్ పోలీసుల సూచనలు..
మీ విలువైన వస్తువులను భద్రపరచండి, పండుగలను సురక్షితంగా జరుపుకోండి. మీ ఇళ్లు సురక్షితంగా ఉన్నప్పుడే పండుగ ప్రయాణాలు సురక్షితం.
ఊరికి వెళ్లాల్సి వస్తే విలువైన బంగారు, వెండి, ఆభరణాలు, డబ్బులు, బ్యాంక్ లాకర్లలో భద్రపర్చుకోండి. లేదంటే మీ ఇంట్లోనే రహస్య ప్రదేశంలో దాచుకోండి. బీరువా తాళాలను ఇంట్లో ఇతరులకు అందుబాటులో ఉంచరాదు తమతో పాటే తీసుకెళ్లాలి.
సెలవుల్లో బయటికి వెళుతున్నప్పుడు మీ ఇంటికి సెంట్రల్ లాక్ సిస్టమ్ ఉండే తాళం, సెక్యూరిటీ అలారం, మోషన్ సెన్సర్ను ఏర్పాటు చేసుకోండం మంచిది.
తాళం వేసి ఊరికి వెళ్లాల్సి వస్తే తప్పనిసరి పోలీస్టేషన్ లో సమాచారం ఇవ్వండి. వారి వివరాలు నమోదు చేసుకొని వారి ఇళ్లపై నిఘా ఏర్పాటు చేస్తాం.
మీ వాహనాలను ఇంటి ఆవరణలోనే పార్కు చేసుకోండి. ద్విచక్ర వాహనాలకు తప్పనిసరిగా వీల్స్ లాక్ తో, చైన్స్ తో పోల్స్, చెట్లకు లాక్ వెయ్యడం మంచిది. సీసీ కెమెరాలు అమర్చుకోవాలన్నారు.
మీమీ కాలనీలో ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే స్థానిక పోలీసు స్టేషన్ కు తప్పనిసరిగా సమాచారం ఇవ్వండి. డయల్ 100కు కాల్ చేయండని, ప్రజలు పోలీస్ శాఖ వారి సూచనలు పాటిస్తూ సహకరిస్తే చోరీల నియంత్రించడం సులభం అవుతుంది సీఐ తెలిపారు.

0
109 views