అంపైర్‌గా సూరిబాబు నియామకం
శ్రీకాకుళం: వరల్డ్ సూపర్ 1000 బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌కు అంపైర్‌గా జిల్లాకు చెందిన సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ సంపతిరావు సూరిబాబు నియామకమయ్యారు. ఈ మేరకు బ్యాడ్మింటన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి వర్తమానం అందుకున్నారు. ఢిల్లీ వేదికగా ఈ ప్రతిష్టాత్మక టోర్నీ ఈనెల 13 నుంచి 18 వరకు జరగనుంది. ఈ టోర్నమెంట్‌లో ప్రపంచంలోని టాప్ 32 మంది షట్లర్స్ పాల్గొంటున్నారు. ఇండియాలో ఈ మెగా టోర్నీ (సూపర్ 1000) మొదటిసారిగా జరుగుతుండగా.. ప్రైజ్‌మనీగా రూ.10 కోట్లకు పైగా అందజేయనున్నారు. కాగా సూరిబాబు ఎచ్చెర్ల మండల పరిధిలోని చిలకపాలేం జిల్లా పరిషత్ హైస్కూల్‌లో ఎస్‌ఏ పీఈ (పీడీ)గా పనిచేస్తున్నారు. ఈయన జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సీఈవోగా పనిచేస్తుండగా.. ఒలింపిక్ అసోసియేషన్, పీడీ-పీఈటీ సంఘంలోనూ కీలక భూమిక పోషిస్తున్నారు. అంపైర్‌గా సూరిబాబు నియామకంపై జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ అధ్యక్షుడు కిళ్లంశెట్టి సాగర్, చీఫ్ పేట్రన్ డాక్టర్ గూడెన సోమేశ్వరరావు, ప్రధాన కార్యదర్శి మెట్ట అశోక్‌కుమార్, దామోదర్, గురుగుబెల్లి ప్రసాద్, రత్నాజీ, అనిల్‌కుమార్, చిలకపాలేం హైస్కూల్ హెచ్‌ఎం చౌదరి లీలావతి కుమారి తదితరులు హర్షం వ్యక్తం చేశారు.