logo

అల్లసాని పెద్దన విగ్రహావిష్కరణలోనంద్యాల రచయితకు ఘన సన్మానం.

నంద్యాల (AIMA MEDIA): వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామంలో ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన విగ్రహావిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కవి సమ్మేళనంలో నంద్యాల పట్టణానికి చెందిన ప్రముఖ రచయిత కొప్పుల ప్రసాద్ పాల్గొని తన కవితా గానంతో ఆహుతులను అలరించారు. సభానంతరం నిర్వాహకులు ఆయన్ని శాలువా, జ్ఞాపికతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ప్రధాన కార్యదర్శి జిక్కా సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా కొప్పుల ప్రసాద్ మాట్లాడుతూ.. అష్టదిగ్గజ కవులలో అగ్రగణ్యుడైన అల్లసాని పెద్దన విగ్రహావిష్కరణలో పాల్గొనడం ఒక రచయితగా తనకు తీయని అనుభూతిని కలిగించిందని, నంద్యాల ప్రతినిధిగా రావడం తన అదృష్టమని పేర్కొన్నారు.సాహిత్య రంగంలో కొప్పుల ప్రసాద్ చేస్తున్న కృషిని నంద్యాల పుర ప్రముఖులు, న్యూక్లియస్ కళాశాల యాజమాన్యం మురళీధర్ రెడ్డి, వాసుదేవ రెడ్డి, శాస్త్రవేత్త రవీంద్రనాథ్, డాక్టర్ రవికృష్ణ, డాక్టర్ ఉదయ్ శంకర్, డాక్టర్ సహదేవుడు, అన్నెం శ్రీనివాసరెడ్డి, నరేంద్ర తదితర సాహితీవేత్తలు, పండితులు అభినందించారు.

0
695 views