logo

శ్రీ శంబర పోలమాంబ అమ్మవారికి పసుపు కుంకుమ సమర్పణ Aima Media News



ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దేవత, కోరిన కోరికలు తీర్చే కల్పవల్లి శ్రీ శంబర పోలమాంబ అమ్మవారి జాతరలో భాగంగా సోమవారం సాయంత్రం 7 గంటలకు అమ్మవారిని గ్రామంలోనికి కొనితెచ్చుట కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలు, కోలాటం తప్పుడు గుళ్ళు తో అమ్మవారిని గ్రామంలోకి కొని తెచ్చారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ నైదాన చిన తిరుపతి, కార్యనిర్వాహణాధికారి బి శ్రీనివాస్, సర్పంచ్ వి సింహాచలయమ్మ, నైదాన సూర్య యాదవ్, గ్రామ పెద్దలు, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

4
208 views