సాలూరు టౌన్ లో ఘనంగా జాతీయ యువజన దినోత్సవ సంబరాలు
శ్రీ స్వామి వివేకానంద సూక్తులు దేశ యువతకు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సాలూరు టౌన్ గుమ డామ్ ప్రాంతంలో శ్రీ స్వామి వివేకానంద జయంతి జాతీయ యువజన దినోత్సవం ఘనంగా నిర్వహించారు. నేటి యువతకి ఆయన సూక్తులు ఆదర్శమని వక్తలు పేర్కొన్నారు. సాలూరు, పాచిపెంట ఎంఈఓ లు వెంకట్రావు, సతీష్ ఉపాధ్యాయులు మహంతి రాంబాబు, భాస్కర్ రావు, ప్రసాద్ తదితరులు హాజరయ్యారు. శ్రీ స్వామి వివేకానంద యువజన సేవా సంఘం ప్రెసిడెంట్ బంటు సోమేశ్ ఆధ్వర్యంలో విజేతలకు బహుమతుల అందించారు.