logo

దొర్నిపాడు మండలములో K.P ఓబులేష్ ఆధ్వర్యంలో MRPS మండల కమిటీ ఎన్నిక.

నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ నియోజకవర్గం లోని దొర్నిపాడు మండల కేంద్రంలో పద్మశ్రీ మందకృష్ణ మాదిగ ఆదేశాల మేరకు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షులు నంద్యాల MRPS జిల్లా ఇంచార్జి డాక్టర్ మున్నంగి నాగరాజు మాదిగ సలహా మేరకు, ఆళ్లగడ్డ జిల్లా అధికార ప్రతినిధి K.P ఓబులేష్ మాదిగ ఆద్వర్యంలో సోమవారం నాడు నూతన MRPS మండల కమిటీ నిర్మాణము చేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్య అతిధులుగా జిల్లా కో ఇంచార్జి లు MSP జాతీయ నాయకులు చిలుక రాబిన్ సన్ మాదిగ, రాష్ట్ర నాయకులు కోళ్ల కల్యాణ్ మాదిగ, MRPS జిల్లా అధ్యక్షులు శివనారాయణ, MSP జిల్లా అధ్యక్షులు భాషాపోగుల దరగయ్య మాదిగ, MEF జిల్లా అధ్యక్షులు రామతీర్థం శేషు మాదిగ, MEF నాయకులు ప్రతాప్ మాదిగ, MSF అధ్యక్షులు వి. అనిల్ మాదిగలు పాల్గొని MRPS మండల అధ్యక్షులుగా సుబ్బరామకృష్ణ అలియాస్ కిట్టు ను మరియు MSP గౌరవ అధ్యక్షులుగా ఓబులపతి, అధ్యక్షులుగా బాలస్వామి,MSF అధ్యక్షులుగా బాలు మాదిగలను ఎంపిక చేయడం జరిగింది.ఈ కార్యక్రమములో షాబోలు రామారావు, ఉయ్యాలవాడ MRPS ఇంచార్జి నాగమద్దిలేటి తదితరులు పాల్గొన్నారు.

8
324 views