logo

స్వామి వివేకానంద సేవలు నేటి యువతకు ఆదర్శం :- రెడ్డి ఎర్రి నాయుడు


స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మాతృభూమి సేవా సంఘం మరియు పెద్ద మేడపల్లి యూత్ & ఎంప్లోయిస్ యూనియన్ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద చిత్రపటానికి నివాళులు అర్పించి, 100 మంది నిరుపేదలకు బట్టల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రెడ్డి ఎర్రి నాయుడు మాట్లాడుతూ, నేటి యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకొని సన్మార్గంలో నడవాలని, దేశ భవిష్యత్తుకు బాధ్యతాయుతమైన వారసులుగా నిలవాలని పిలుపునిచ్చారు. స్వామి వివేకానంద బోధనలు యువతలో ఆత్మవిశ్వాసం, దేశభక్తిని పెంపొందిస్తాయని ఆయన అన్నారు.
కార్యక్రమంలో జిల్లా పౌరవేదిక కార్యనిర్వాహక అధ్యక్షులు పిడకల ప్రభాకర్ మాట్లాడుతూ, భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచ దేశాలకు తెలియజేసి, మన సంప్రదాయాలు–సంస్కృతిని గౌరవించే విధంగా స్వామి వివేకానంద ప్రపంచానికి పరిచయం చేశారని పేర్కొన్నారు.
మాతృభూమి సేవా సంఘం కార్యదర్శి ఐ. గోపాలరావు మాట్లాడుతూ, యువత బాధ్యతతో పాటు దేశంపై ప్రేమతో పనిచేయాలని, అప్పుడే సమాజ అభివృద్ధి, దేశాభివృద్ధి సాధ్యమవుతాయని అన్నారు. యువత చెడు మార్గాలు విడిచిపెట్టి మంచి మార్గంలో ప్రయాణిస్తూ స్వామి వివేకానంద విలువలను ఆచరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో పౌరవేదిక సభ్యులు తుమ్మగంటి రాంమోహన్, తట్రాజ్ రాజారావు, మాజీ ఎంపీటీసీ సభ్యులు దొగ్గ నూకి నాయుడు రెడ్డి విజయ్ కుమార్ నాయుడు, మాతృభూమి సేవా సంఘం మెంటాడ మండల అధ్యక్షులు సిరిపురం జగదీష్, సభ్యులు సన్నీ, చిన్నరావు, మారడ సింహాచలం, , గ్రామీణ వైద్యులు యడ్ల గోవిందరావు తదితరులు పాల్గొన్నారు.

11
782 views