logo

ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ . దుగ్గిరాల.....

తేదీ 12/01/2026, దుగ్గిరాల:జాతీయ యువజన దినోత్సవం
ఈ రోజు ఉదయం దుగ్గిరాల శివాలయం సెంటర్ లో జాతీయ యువజన దినోత్సవంను ఫ్రెండ్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కన్వీనర్ తాడిబోయిన రామస్వామి యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా స్వామి వివేకానంద చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు . ఈ సందర్భంగా రామస్వామి యాదవ్ మాట్లాడుతూ మనదేశ ఔనత్యాన్ని ప్రపంచ దశ దిశలా ఎలుగెత్తి చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు . వివేకానంద స్వామి ఆశయాలు , స్ఫూర్తిదాయకమైన మాటలు పై ద్రుష్టి సారించటమే ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం అని అన్నారు . యువత దేశ భవిషత్తుకి పునాది వంటి వారు అని అన్నారు . స్వామి వివేకానంద యువతకు నిజమైన స్ఫూర్తిదాయకం . అయన సన్యాసే కాదు దార్శనికుడు , ఒక ప్రేరణశీలి . దేశ భవిష్యత్తు యువత చేతులలోనే ఉన్నది . యువత సంకల్పం , శక్తి , సృజనాత్మకత దేశాన్ని ఉన్నత శిఖరాలకు చేర్చగలవు . యువత ఆత్మ విశ్వాసం , క్రమశిక్షణ తో. ఏ లక్ష్యంనైనా సాధించవచ్చు . యువత " మేల్కొనండి లక్ష్యం చేరేవరకు ఆగకండి " వంటి సూక్తులు యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి . యువత చెడుఅలవాట్లకు దూరంగా ఉంట్టు సేవను అలవర్చుకోవాలి . సమాజ సేవ దేశ ఔనత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పగలవు . స్వామి వివేకానంద వేదాంత , యోగ తత్వ శాస్త్రములు సమాజంపై అత్యంత ప్రభావం చూపించిన వ్యక్తి . స్వామి వివేకానంద రాజయోగ , కర్మయోగ , భక్తియోగ , జ్ఙాన యోగ పై రచనలు చేసారు . విశ్వవ్యాప్తం గా అయన జీవితం ఎందరికో స్ఫూర్తిదాయకం అన్నారు . అయన చేసిన సేవలకు భారత ప్రభుత్యం ఆయన జన్మదినమైన జనవరి 12 ను జాతీయ యువజన దినోత్సవంగా 1984 నుంచి ప్రకటించి అమలు చేస్తున్నారు . నేటి యువత అయన జీవితమును ఆదర్శంగా తీసుకొని చెడుఅలవాట్లకు , సామాజిక మాధ్యమాలకు దూరంగా ఉంట్టు విలువలతో కూడిన గుణాత్మ విద్యను అభ్యసించి ప్రపంచస్థాయి లో ఉన్న అవకాశాలను అంది పుచుకొని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకొని దేశాభివృద్ధి లో పాలు పంచుకోవాలని కోరారు . అదే మనం వారికి అర్పించే నిజమైన నివాళి అని తెలిపారు .
ఈ కార్యక్రంలో స్థానిక నాయకులు బాలరాజు,నల్లనూకలవేంకటేశ్వరరావు,కుర్రా నాగయ్య , పసుపులేటి గణేష్,కొంగర జోగేంద్ర, షేక్ శుభాని , తాడిబోయిన శ్రీధరబాబు , కరీముల్లా,y. బ్రహ్మస్వరరావు, ch. శ్రీనివాసరావు, హనుమానాయక్,హనుమాన్,అడపా.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు .

107
2890 views