logo

వివేకానంద యువతకు ఆదర్శప్రాయులు: జాతీయ యువజన దినోత్సవ వేడుకల్లో డాక్టర్ డివిజి శంకరరావు


జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం స్థానిక కామాక్షి నగర్, అయ్యన్నపేట వద్దనున్న మున్సిపల్ నడక మైదానంలో క్లబ్ అధ్యక్షులు సిహెచ్ రమణ నిర్వహించారు.
కార్యక్రమంలో భాగంగా ముందుగా స్వామి వివేకానంద చిత్రపటానికి క్లబ్ సభ్యులంతా పూలమాలవేసి నివాళులు అర్పించారు. అనంతరం సమాజంలో ఎంతో నిస్వార్థంగా సేవచేస్తున్న యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్న, మదర్ థెరీసా ప్రజాసేవా సంఘం & బ్లడ్ డోనర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు త్యాడ ప్రసాద్ పట్నాయక్ కు, తైక్వాండో జాతీయ స్థాయిలో గోల్డ్ మెడల్ సాధించిన కణపాకకు చెందిన సివిల్ కానిస్టేబుల్ బి. ఎస్. ఎన్. మూర్తి కు ముఖ్యఅతిథిగా హాజరైన ప్రముఖ సాహితీవేత్త, మాజీ పార్లమెంట్ సభ్యులు డాక్టర్ డివిజి శంకరరావు సత్కరించటం జరిగింది.
ఈ సందర్భంగా డివిజి శంకరరావు మాట్లాడుతూ - యువతను చైతన్యవంతుల్ని చేసిన సుప్రసిద్ధ గొప్ప ఆధ్యాత్మిక వేత్త, యోగి, విదేశాల్లో సైతం హిందూధర్మం విశిష్టతను, భారతీయ సంస్కృతిని, గొప్పతనాన్ని ప్రపంచానికి చాటిచెప్పిన మహనీయులు స్వామి వివేకానందని, అటువంటి మహనీయున్ని యువతంతా ఆదర్శంగా తీసుకోవాలని కోరారు.
కార్యక్రమంలో క్లబ్ కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, ఉపాధ్యక్షులు పి. అప్పలరాజు, జి. సూర్యప్రకాశరావు, జాయింట్ సెక్రటరీ ఐ. అప్పలరాజు, జాలీ వాకర్ వై. నలమహారాజు, క్లబ్ పెద్దలు కోట్ల సత్యనారాయణ, శ్రీనివాస్ రావు, దీక్షిత్ తదితరులు హాజరయ్యారు.

0
290 views