logo

మాట మార్చిన మంత్రి కోమటిరెడ్డి

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్క రోజులోనే తన మాట మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.
నిన్నటివరకు సినిమా టికెట్ ధరల పెంపుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పిన మంత్రి, ఈరోజు మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చల తర్వాతే టికెట్ ధరలు పెంచామని ఆయన వెల్లడించారు.

టికెట్ ధరల పెంపు తనకు తెలిసే జరుగుతుందని, ఈ విషయంలో ప్రభుత్వంలో సమిష్టిగా నిర్ణయం తీసుకున్నామని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తెలిపారు. సినిమా టికెట్ ధరల అంశంపై తాము అందరం కలిసి కూర్చొని చర్చించామని, ఆ తర్వాతే తుది నిర్ణయానికి వచ్చామని స్పష్టం చేశారు. దీంతో నిన్న చేసిన వ్యాఖ్యలకు, నేడు చేసిన వ్యాఖ్యలకు మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తోందని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి.

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ప్రశంసలు కురిపించారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి. రేవంత్ రెడ్డి కూడా దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి మాదిరిగానే ఎవరి శాఖలోకి అనవసరంగా జోక్యం చేసుకోరని వ్యాఖ్యానించారు. ప్రతి శాఖకు సంబంధించిన నిర్ణయాలు ఆయా మంత్రుల సూచనలు, సమీక్షల ఆధారంగానే జరుగుతాయని తెలిపారు.

టికెట్ ధరల పెంపు అంశంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. ఒకవైపు సినీ పరిశ్రమకు మద్దతుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు చెబుతుండగా, మరోవైపు సామాన్య ప్రేక్షకులపై భారం పెరిగిందని విమర్శలు కూడా వినిపిస్తున్నాయి.

సినిమా టికెట్ రేట్ల పెంపుపై తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చ కొనసాగుతోంది. ఈ అంశంపై సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఒక్క రోజులోనే తన మాట మార్చడం రాజకీయ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది. నిన్నటివరకు సినిమా టికెట్ ధరల పెంపుకు తనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టంగా చెప్పిన మంత్రి, ఈరోజు మాత్రం భిన్నమైన వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చల తర్వాతే టికెట్ ధరలు పెంచామని ఆయన వెల్లడించారు.

6
224 views