logo

ఉచిత వైద్య శిబిరంలో పాల్గొన్న నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ !


ఖానాపూర్ మండలంలోని పాత ఎల్లాపూర్ గ్రామంలో గ్రామ సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో వెల్నేస్ హాస్పిటల్ నిజామాబాద్, మైత్రి హాస్పిటల్ ఖానాపూర్ సహకారంతో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరంలో నిర్మల్ డీసీసీ అధ్యక్షులు, ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హాస్పిటల్ వెళ్లే స్థోమత లేని ప్రజలకు ఉచిత వైద్య శిబిరాల వల్ల మేలు జరుగుతుందన్నారు.
ఏ ఆరోగ్య సమస్య ఉన్న మొదటనే గుర్తించి హాస్పిటల్ వెళ్లాలని, తీవ్రతరం అయ్యే వరకు చూసుకోవద్దని సూచించారు. ప్రతి గ్రామంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఈ సందర్బంగా వైద్య శిబిరం ఏర్పాటు చేసిన సర్పంచ్ ప్రశాంత్ రెడ్డి ని, హాస్పిటల్ యాజమాన్యంను అభినందించారు.
ఈ కార్యక్రమంలో గ్రామ ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

1
448 views