logo

మయన్మార్ సైబర్ ముఠా చెర నుండి 27 మంది ఉత్తరాంధ్ర యువకుల విముక్తి: కేంద్ర మంత్రి చొరవతో సురక్షితంగా స్వదేశానికి..



ఉపాధి కోసం విదేశాలకు వెళ్లిన విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం ప్రాంతాలకు చెందిన 27 మంది యువకులు మయన్మార్‌లో సైబర్‌ క్రైమ్‌ ముఠాకు చిక్కుకొని నరకయాతన పడ్డారు. యువకులు ఈ విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి విదేశాంగ శాఖ మంత్రితో మాట్లాడి తిరిగి మన దేశానికి తీసుకొచ్చారు. ఆదివారం విశాఖ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న యువకులు మంత్రికి, ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.

0
163 views