
జనసేన పార్టీ అధికారప్రతినిధి శ్రీ ఇరిగెల బ్రదర్స్ వారి సమక్షంలో 50 కుటుంబాలు జనసేన పార్టీలో చేరారు
రుద్రవరం మండలం పెద్ద కంబాలూరు మజర గోనం పల్లె గ్రామానికి చెందిన నల్లబోతుల పెద్ద పుల్లయ్య వెంకటేశ్వర్లు శ్రీనివాసులు మల్లయ్య బాల మల్లయ్య. శీలం నర్సింహులు దాదాపు 50 కుటుంబాల వారు ఆదివారం మేళతాళాలతో పూల వర్షంతో మహిళలు సైతం స్వాగతం పలుకుతూ స్వచ్ఛందంగా ఇరిగేలా బ్రదర్స్.. తాలూకా జనసేన పార్టీ అధికారప్రతినిధి శ్రీ ఇరిగెల సూర్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో పార్టీలో చేరారు ఈ సందర్భంగా ఇరిగెల బ్రదర్స్ మాట్లాడుతూ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాలను నమ్మి మా పై నమ్మకంతో స్వచ్ఛందంగా జనసేన పార్టీలో చేరారని పార్టీలోకి చేరిన కుటుంబాలకు అండగా ఉండి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని తెలిపారు అలాగే త్వరలో జరగనున్న పంచాయతీ మున్సిపల్ జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో జనసేన పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపి తాలుకలో జనసేన పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సీనియర్ నాయకులు శ్రీ ఇరిగెల రామచంద్రారెడ్డి గారు. శ్రీ ఇరిగెల ప్రతాపరెడ్డి గారు.. శ్రీ ఇరిగేల సుధాకర్ రెడ్డి గారు.. శ్రీ జున్ను ప్రసాద్ రెడ్డి గారు..రంగస్వామి గారు రుద్రవరం మండలం నాయకులు నాగలింగమయ్య గౌడ్... తాలూకా జనసేన పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులు డాలు రత్నమయ్య.. కౌన్సిలర్ గురుమూర్తిగారు మిద్దె రామ పుల్లయ్య... తదితరజనసేన పార్టీ కార్యకర్తలు నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు