logo

దివ్యాంగుల సంక్షేమ సంఘం సేవలు ప్రశంసనీయం: వెదుర్ల రామచంద్రరావు.

నంద్యాల (AIMA MEDIA): దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం కార్యాలయంలో నిర్వహించిన సేవా కార్యక్రమంలో ప్రముఖ న్యాయవాది, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి వెదుర్ల రామచంద్రరావు సౌజన్యంతో 20 మంది దివ్యాంగులకు 15 వేల రూపాయల విలువ చేసే నెలవారి మందులను పంపిణీ చేశారు.నంద్యాల జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో వెదుర్ల రామచంద్రరావు, ఐఎంఏ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం గౌరవ అధ్యక్షులు డాక్టర్ రవి కృష్ణ పాల్గొని ప్రసంగించారు. వెదుర్ల రామచంద్రరావు మాట్లాడుతూ దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో గత 24 సంవత్సరాలుగా దివ్యాంగులకు చేస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. దీర్ఘకాలిక జబ్బులతో బాధపడే దివ్యాంగులకు నెలవారి మందులను కొనుగోలు చేసి గత 20 సంవత్సరాలుగా పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. డాక్టర్ రవి కృష్ణ మాట్లాడుతూ దివ్యాంగుల సేవలు నిరంతరం కొనసాగుతాయని, నంద్యాల లయన్స్ క్లబ్, నంద్యాల ఐఎంఏ వైద్యుల సహకారంతో, పట్టణ ప్రముఖుల సహకారంతో గత 24 సంవత్సరాలుగా వేలాది దివ్యాంగులకు సహకారం అందించామన్నారు. ఇదే కార్యక్రమంలో హైదరాబాద్ సాఫ్ట్ వేర్ ఇంజనీరుగా పనిచేస్తున్న సుష్మ వచ్చే నెలలో దివ్యాంగులకు నెలవారి మందుల కోసం 9 వేల రూపాయల విరాళాన్ని దివ్యాంగుల సంక్షేమ సంఘానికి అందజేశారు.ఈ సందర్భంగా గత రెండు దశాబ్దాలుగా దివ్యాంగులకు సహకారం అందిస్తున్న వెదుర్ల రామచంద్రరావు,వర్ధంశెట్టి రాజారామ్,ఈరోజు విరాళం అందజేసిన సుష్మ లను దివ్యాంగుల సంక్షేమ సంఘం తరఫున ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమంలో , జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు రమణయ్య,నంద్యాల లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేసుల నాగరాజు, కోశాధికారి అమిదేల జనార్ధన్,దివ్యాంగుల ఉద్యోగుల విభాగం అధ్యక్షులు కిషోర్, కళారాధన కార్యవర్గ సభ్యులు శివరామిరెడ్డి, బాలచంద్రుడు, సుష్మ , కార్యాలయ కార్యదర్శులు అలా మధు,వెంకటేశ్వర్లు, సూర్య పాల్గొన్నారు.

0
250 views