logo

పేదింటి మహిళల అభివృద్దే శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ లక్ష్యం... శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఛైర్పర్సన్ నాగిని రవి సింగా రెడ్డి

AIMA MEDIA NANDYAL
11/01/2026...
పేదింటి మహిళల అభివృద్దే శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ లక్ష్యం అని బ్యాంక్ ఛైర్పర్సన్ నాగిని రవి సింగా రెడ్డి పేర్కొన్నారు. గత 15 సంవత్సరాలుగా అనేక అడ్డంకులు, ఇబ్బందులు ఎదురైనా నిరంతరంగా పేదింటి మహిళల సాధికారతకు అభివృదికి తోడ్పాటు అందిస్తూ బ్యాంక్ ద్వార ఋణాలను అందిస్తున్నామని ఆమె తెలిపారు. ఆదివారం నంద్యాల పట్టణం శిల్పా సేవా సమితి కార్యాలయం ఆవరణంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ద్వార 161 మంది మహిళలకు 25లక్షల 67వేల రూపాయల విలువగల రుణాలను చెక్కుల రూపేణా బ్యాంక్ ఛైర్పర్సన్ నాగిని రవి సింగా రెడ్డి పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ ఛైర్పర్సన్ మాట్లాడుతూ... రాష్ట్రంలో దిగ్విజయంగా గత 15 సంవత్సరాలుగా పేదింటి మహిళల అభివృద్దే లక్ష్యంగా తక్కువ వడ్డీతో రుణాలను అందిస్తున్నామని తెలిపారు. స్వలాభం లేకుండా నిస్వార్ధంగా మహిళల అభ్యున్నతిని కాంక్షించి నిర్వహిస్తున్నామని అన్నారు. ఒకరికోసం అందరూ, అందరికోసం ప్రతి ఒక్కరు పరస్పర సహకారం అందిస్తూ శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ సేవలను ముందుకు తీసుకెళ్లాలని కోరారు. రుణాలు తీసుకున్న వారు సకాలంలో చెల్లించాలని తెలిపారు. మంచి చేసే వారు నాయకులు ఐతే అందరికి మంచి చేకూరుతుంది పేర్కొన్నారు. కార్యక్రమంలో శిల్పా మహిళా సహకార్ బ్యాంక్ డైరెక్టర్ పూర్ణిమ, మేనేజర్ హరిలీల, శిల్పా సేవాసమితి మేనేజర్ లక్ష్మీ నారాయణ, సిబ్బంది పాల్గొన్నారు.

0
0 views