logo

నిజాయితీ, నిస్వార్థంకి మారుపేరు శ్రీ తుర్లపాటి చెంచల్ రావు.

దయ, నిజాయితీ, నిస్వార్థం, సహాయం వంటి అన్ని లక్షణాలు కలిగిన వ్యక్తి నేటి సమాజంలో అరుదు. అటువంటి అన్ని లక్షణాలు కలిగి అందరితోనూ స్నేహభావంతో ఉంటూ అనేక సేవా కార్యక్రమాలు చేపట్టినటువటింటి వ్యక్తి స్వర్గీయ శ్రీ తుర్లపాటి చంచల్ రావు.
బ్యాంక్ ఆఫీసర్ గా రిటైర్ అయి తమ సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారితో కలిసి అనేక సేవా కార్యక్రమాలలో పాల్గొని అందులో భాగంగా ఖమ్మం జిల్లా కమలాపురంకి చెందిన జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని విద్యార్ధులకు గత 17 ఏళ్లుగా ప్రతీ ఏటా తమవంతు సహాయంగా పుస్తకాలు, పరికరాలు, బహుమతులు, ఆర్థిక సహాయం అందజేస్తూ విద్యార్ధులను ఉత్సాహపరిస్తూ ఉండడం నిజంగా గొప్ప విషయం.
ప్రతీ సంవత్సరం లాగానే ఈ ఏడాది కూడా విద్యార్ధులకి అలాగే పాఠశాల యాజమాన్యంకి పుస్తకాలు, స్పోర్ట్స్ పరికరాలు మరియు క్లాస్ ఫస్ట్ వచ్చిన విద్యార్ధులకు అర్ధిక సహాయం అందజేశారు.
1941 జూన్ 17 న హైదరాబాద్ లో జన్మించిన శ్రీ చంచల్ రావు 1960 లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్ లో గుమస్తా స్థాయి నుంచి బ్యాంక్ మేనేజర్ వరకు వివిధ శాఖల్లో పనిచేసి 2001 న పదవీ విరమణ చేశారు. వీరి సతీమణి శ్రీమతి విజయలక్ష్మి గారు తెలుగు లెక్చరర్ గా పనిచేశారు. వీరు డిసెంబర్ 17, 2025 న అనారోగ్య కారణం చేత తుదిశ్వాస విడిచారు. వీర్కి ఇద్దరు కుమారులు తుర్లపాటి శ్రీకాంత్, తుర్లపాటి శశికాంత్. ఇరువురు కూడా తండ్రి బాధ్యతలను నిర్విరామంగా కొనసాగించడానికి కంకణం కట్టుకున్నారు.

- తూములూరి శ్రీ కుమార్

50
2347 views