logo

అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ నూతన కమిటీ ప్రమాణస్వీకారం: సామాజిక సేవలే లక్ష్యం!


అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ 2026 సంవత్సర నూతన కమిటీ ప్రమాణస్వీకార మహోత్సవం ఆదివారం ఉదయం కామాక్షినగర్, అయ్యన్నపేట చెరువు వద్దనున్న మున్సిపల్ నడకమైదానంలో క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షుడు త్యాడ రామకృష్ణారావు(బాలు) ఆధ్వర్యంలో జరిగింది.
ముందుగా వాకర్స్ క్లబ్ ఉద్యమకారుడు జె.ఎల్. తోషిణి వాల్ చిత్రపటానికి ముఖ్యఅతిథులుగా హాజరైన డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు, వాకర్స్ ఇంటర్నేషనల్ ఏరియా వైస్ ప్రెసిడెంట్ పి.జి. గుప్తా, వాకర్స్ ఇంటర్నేషనల్ ట్రస్ట్ బోర్డు మెంబర్ జి. కృష్ణ రాజు, ఎలక్ట్ గవర్నర్ టి. చిరంజీవి రావు, న్యాయవాది ఎస్ ఎస్ ఎస్ ఎస్ రాజు, మాజీ పార్లమెంట్ సభ్యుడు డి.వి.జి. శంకరరావు, అంజనీపుత్ర చిరంజీవి వాకర్స్ క్లబ్ అధ్యక్షుడు పిన్నింటి సూర్యనారాయణ జ్యోతి ప్రజ్వలన చేసి నివాళులర్పించారు.
అనంతరం డిస్ట్రిక్ట్ 102 గవర్నర్ ఎ. తిరుపతి రావు క్లబ్ అధ్యక్షుడు సిహెచ్ రమణ, కార్యదర్శి కోట్ల ఈశ్వరరావు, కోశాధికారి టి.వి. రత్నాకర రావు మరియు మిగిలిన కార్యవర్గంచే ప్రమాణస్వీకారం చేయించారు.
ఈ సందర్భంగా తిరుపతి రావు మాట్లాడుతూ సామాజిక సేవలే వాకర్స్ క్లబ్ ల లక్ష్యమని, ఇవి సమాజానికి పట్టుకొమ్మలని పేర్కొన్నారు. సమాజ సేవలో అన్ని విభాగాల్లోనూ వాకర్స్ క్లబ్ లు ముందంజలో ఉన్నాయని, తమ ఆరోగ్యం కాపాడుకుంటూ ప్రజల ఆరోగ్యం కోసం పాటుపడుతున్న క్లబ్ ల సేవలు అపారమని కొనియాడారు.
కార్యక్రమంలో సాయికృష్ణా వాకర్స్ క్లబ్, బాలాజీ వాకర్స్ క్లబ్, తోషినీ వాల్ వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్, ఈవినింగ్ వాకర్స్ క్లబ్, ఫ్రెండ్స్ వాకర్స్ క్లబ్, ప్రగతి వాకర్స్ క్లబ్, దత్తసాయి వాకర్స్ క్లబ్, సాగి శివ సీతారామరాజు వాకర్స్ క్లబ్, వనితా వాకర్స్ క్లబ్, రామసాయి వాకర్స్ క్లబ్ ప్రతినిధులు భారీగా పాల్గొన్నారు.

0
0 views