logo

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ నేరాలపై ఉక్కుపాదం జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా హిందూపురం రూరల్ పరిధిలో

శ్రీ సత్యసాయి జిల్లా పోలీస్ నేరాలపై ఉక్కుపాదం
జిల్లాలో శాంతి భద్రతలను కాపాడటమే లక్ష్యంగా హిందూపురం రూరల్ పరిధిలోని లేపాక్షి మండలం పులిమతి పంచాయతీ తిలక్ నగర్‌లో జిల్లా ఎస్పీ శ్రీ ఎస్. సతీష్ కుమార్ ఐపీఎస్ గారి ఆధ్వర్యంలో భారీ కార్డెన్ అండ్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. 120 మంది పోలీసు సిబ్బంది పాల్గొన్న ఈ ఆపరేషన్‌లో ప్రతి ఇంటిని, పరిసర ప్రాంతాలను క్షుణ్ణంగా తనిఖీ చేశారు.

రౌడీ షీటర్లు, పాత నేరస్తులు, ఫ్యాక్షనిస్టులు శాంతిభద్రతలకు భంగం కలిగిస్తే ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని జిల్లా ఎస్పీ గారు స్పష్టం చేశారు. మార్పు చూపని వారిపై కఠిన చర్యలు, రౌడీ షీట్లు ఓపెన్ చేయడం తప్పదని హెచ్చరించారు. పత్రాలు లేని ద్విచక్ర వాహనాలు, ఆటోలను సీజ్ చేసి నేరాలకు ఉపయోగించే వాహనాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు.

డ్రోన్ కెమెరాలు, బాడీ వోర్న్ కెమెరాలు, ఫింగర్ ప్రింట్ స్కానర్లు, మొబైల్ స్కానింగ్ డివైసులతో ఆధునిక సాంకేతికతను వినియోగిస్తూ 24 గంటల నిఘా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు భయంలేకుండా ప్రశాంతంగా జీవించాలనే ఉద్దేశంతో ఈ ఆపరేషన్లు కొనసాగుతాయని, అనుమానాస్పద వ్యక్తులు లేదా కదలికలు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు

4
534 views