logo

అధికారుల నిర్లక్ష్యం… క్వారీ బ్లాస్టింగ్‌తో ప్రజలు ఇబ్బందులు

అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం. కొవ్వూరు పరిసరాల్లో విరివిగా సాగుతున్న అక్రమ మైనింగ్‌పై గ్రామస్తుల ఆగ్రహం
తక్షణ చర్యలు తీసుకోకపోతే ఆందోళనల హెచ్చరిక కొవ్వూరు గ్రామం చుట్టుపక్కల ప్రాంతాల్లో అక్రమంగా సాగుతున్న మైనింగ్ కార్యకలాపాలు గ్రామ ప్రజలకు నానా ఇబ్బందులు తెచ్చిపెడుతున్నాయి. కొవ్వూరు, పొరుగున ఉన్న గ్రామాల వద్ద క్వారీ యాజమాన్యాలు భారీ యంత్రాలను ఉపయోగించి రోజు రోజుకు బ్లాస్టింగ్లు చేస్తుండటంతో గ్రామ ఇళ్లకు పగుళ్లు ఏర్పడుతున్నాయి. పగలు–రాత్రి ఎడతెరిపిలేకుండా లారీలు తిరగడం వల్ల రహదారులు చెదిరిపోయాయి. ఆ రహదారుల మీదుగా రోజూ స్కూళ్లకు వెళ్లే విద్యార్థులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.గ్రామానికి చెందిన బంటు రాజు మాట్లాడుతూ, “మేము ఎన్నిసార్లు అధికారుల దృష్టికి ఈ సమస్య తీసుకెళ్లాం. పత్రికల్లో కూడా ఈ విషయం పలుమార్లు రాసారు. అయినా అధికారులు గానీ ప్రజా ప్రతినిధులు గానీ పట్టించుకోవడం లేదు. క్వారీ యజమానులు బోరు రిగ్గింగ్ ఉపయోగించి ప్రమాదకర బ్లాస్టింగ్లు చేస్తున్నారు. దీంతో మాకు భయం ఎక్కువైంది,” అన్నారు.అదే విధంగా, క్వారీ నిర్వాహకులు ఏర్పాటుచేసిన చెక్‌పోస్టుల వద్ద ఎటువంటి ప్రభుత్వ అనుమతులు లేకుండానే వాహనదారుల నుండి రూపాయలు వసూలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ పరిస్థితి గురించి అధికారులకు తెలుసు కానీ, వారు ఏ చర్యలు తీసుకోవడం లేదన్నారు.గ్రామస్థులు వెల్లడించిన ప్రకారం, లారీల రాకపోకలతో రహదారులు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాఠశాల పిల్లలు బైసికిళ్లపై వెళ్లడం ప్రమాదకరం గా మారింది. మైనింగ్ సైట్ల దగ్గర పొగమంచు, ధూళి కారణంగా గాలి కాలుష్యం కూడా తీవ్రమైంది అని .బంటు రాజు అన్నారు, “ఇప్పటికీ అధికారులు స్పందించకపోతే ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఆందోళన చేస్తాం. గ్రామ ప్రజల ఆరోగ్యం, ఆస్తి రక్షణ కోసం క్వారీ కార్యకలాపాలను తక్షణం ఆపాలి,” అని హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో గ్రామ యువకులు, మహిళలు, పెద్దలు పాల్గొని తమ ఆవేదనను వ్యక్తం చేశారు. ప్రజలు ప్రభుత్వాన్ని వేడుకున్నారు .కనీసం ఇప్పటికైనా చర్యలు తీసుకొని ఈ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కోరుతున్నారు

17
916 views