logo

విత్తన శుద్ధి కేంద్రాలు తనిఖి చేసిన జిల్లా వ్యవసాయ అధికారి.

నంద్యాల (AIMA MEDIA): నంద్యాల పట్టణంలో వ్యవసాయ శాఖ అనుమతి పొందిన విత్తనాలు మాత్రమే శుద్ధి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ఎన్. వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.ఈ తనిఖీలో భాగంగా శ్రీ శ్రీ భారతి సీడ్స్, న్యూ వెంకటేశ్వర సీడ్స్ , వినాయక ఆగ్రో ఇండస్ట్రీస్ లో పలు రిజిస్టర్ లు , పత్రాలు, కంపెనీల స్టాక్ లను పరిశీలించారు.తర్వాత జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ ద్వారా అనుమతి పొందిన కంపెనీల ప్రత్తి విత్తనాలు మాత్రమే ప్రాసెసింగ్ చెయ్యాలని అన్నారు.ప్రతీ గోడౌన్ యందు విత్తన నిల్వల స్టాక్ బోర్డు ఏర్పాటు చేసి ప్రతీ రోజు అప్డేట్ చెయ్యాలని,కంపెనీల నుండి వచ్చిన ప్రత్తి విత్తనాలు మరియు తిరిగి కంపెనీకి పంపే ప్రత్తి విత్తనాల నిల్వలను కంపెనీ వారిగా రిజిస్టర్ నిర్వహించాలని పేర్కొన్నారు.ప్రత్తి విత్తన శుద్ది కేంద్రాల యజమానులు అందరూ ప్రత్తి ప్రాసెసింగ్ చేసిన తర్వాత వచ్చే వ్యర్థ లను ETP ప్లాంట్ ద్వారా శుద్ది చెయ్యాలని తెలియచేశారు.ప్రతీ నెలా శుద్ధి చేసిన విత్తన స్టాక్ నిలువల రిపోర్ట్ ని కంపెనీల వారీగా మండల వ్యవసాయ అధికారి ,నంద్యాల వారి ద్వారా జిల్లా వ్యవసాయ అధికారి నంద్యాల వారికి అందచేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి ప్రసాదరావు పాల్గొన్నారు.

0
331 views