logo

కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత* పీఏసీఎస్ క్యాలెండర్ల ఆవిష్కరణ..

*వైసీపీ హయాంలో రైతులకు ఏమి న్యాయం చేశారో చెప్పాలి*

*మా ప్రభుత్వ పాలనలో ప్రతి రైతును ఆదుకునే ప్రయత్నం జరుగుతోంది*

*కందుల కొనుగోలు కేంద్రం ప్రారంభం సందర్భంగా ఎమ్మెల్యే పరిటాల సునీత*

*పీఏసీఎస్ క్యాలెండర్ల ఆవిష్కరణ.. రైతు సమస్యలపై పని చేయాలని సూచన*

వైసీపీ ప్రభుత్వ హయాంలో రైతులకు ఏమి న్యాయం చేశారో చెప్పాలని రాప్తాడు ఎమ్మెల్యే పరిటాల సునీత డిమాండ్ చేశారు. రాప్తాడు మండలం రామినేపల్లి గ్రామంలో ఆమె కందుల కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. మార్కెటింగ్, వ్యవసాయశాఖల అధికారులు, రైతులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అనంతరం సమీపంలోని చీనీ తోటను పరిశీలించారు. దీంతో పాటు రాప్తాడు, బుక్కచర్ల ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల (పీఏసీఎస్) క్యాలెండర్లను ఆయా అధ్యక్షులతో కలసి విడుదల చేశారు. అధ్యక్షులతో పాటు ఇతర సభ్యులు ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకొని వాటి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. రైతులకు అందుబాటులో ఉండాలన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీత మాట్లాడుతూ గత ఐదేళ్ల వైసీపీ పాలనలో రైతులు ఎంత ఇబ్బంది పడ్డారో అందరికీ తెలుసన్నారు. వేరుసెనగ, కంది రైతులు నష్టపోతే ఏం పరిహారం ఇచ్చారని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. కొన్ని చోట్ల రైతులకు ధరలు లేక నష్టపోతే.. అందుకు మద్దతు ధరలు కూడా ఇస్తున్నట్టు తెలిపారు. ఇప్పుడు కంది పంటకు మార్కెట్లో ధరలు తగ్గిన నేపథ్యంలో ప్రభుత్వం కొనుగోలు కేంద్రాల్ని ఏర్పాటు చేసిందన్నారు. ప్రతి రైతు నుంచి ఎకరాకు గరిష్టంగా నాలుగు క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయ‌డం జ‌రుగుతోందని.. గత ఏడాది ధర రూ.7550 ఉండగా..ఇప్పుడు రూ.8వేలతో మార్క్ ఫెడ్ ద్వారా కందులను కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు కొనుగోలు కేంద్రానికి తెచ్చిన కందుల నాణ్యతను తేమ శాతాన్ని స్వయంగా పరీక్షించి అధికారులు సూచించిన విధంగా కందిని రైతులు సిద్ధం చేసుకుని తీసుకురావాలని రైతులకు సూచించడంతోపాటు .. నిబంధనల పేరుతో రైతులను ఎవరూ ఇబ్బంది పెట్టవద్దని అధికారులకు కూడా ఎమ్మెల్యే సునీత సూచించారు...

0
66 views