
మరణానంతరం జీవించండి: అవయవదానంతో మరో నలుగురికి ప్రాణదానం - షిణగం శివాజీ
అఖిలభారత అవయవాదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా సీనియర్ జర్నలిస్ట్,జనవిజ్ఞాన జిల్లా ట్రెజరర్ షిణగం శివాజీ నియమితులయ్యారు.రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న శివాజీ గురజాడ పాఠశాలలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తనకు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు అప్పగించిన అఖిలభారత శరీర అవయవ దాతల సంఘం,స్పెక్ట్ వ్యవస్థాపక అధ్యక్షురాలు డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మికి ధన్యవాదాలు తెలియజేశారు. డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గత రెండున్నర దశాబ్దాలుగా శరీర,అవయవ దానం గురించి ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో అలుపెరగని ఉద్యమాన్ని చేస్తున్నారని, ఆమె ఉద్యమాలు ఫలితంగా ఇప్పటికే ప్రజల్లో శరీర, అవయవదానంపై ప్రజలు చైతన్య వంతులై వేలాదిమంది శరీర, అవయవదానాలకు ముందుకు వస్తున్నారని చెప్పారు.శరీర, అవయవ దాతలు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా తనకు అప్పగించిన బాధ్యతలను శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆయన చెప్పారు.పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదని, మరణించిన తర్వాత మన శరీరాన్ని అగ్నికి ఆహుతి చేయకుండా,మట్టిలో కలపకుండా శరీర,అవయవదానం చేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.సహజ మరణం లేదా దురదృష్టం కొద్దీ ఏదైనా ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయిన వారు అవయవ దానం చేస్తే మరి కొంతమంది ప్రాణాలను కాపాడి వారి ద్వారా మనం తిరిగి మరణించిన.. జీవించవచ్చని.. పేర్కొన్నారు.అదేవిధంగా మరణించిన తర్వాత శరీర దానం చేస్తే, ఆ శరీరం మెడికల్ కళాశాలలో కొంత మంది వైద్యులు ప్రయోగాలకు ఉపయోగపడుతుందని తెలిపారు. శరీర,అవయవధానం చేయాలన్న, ఎవరికైనా అవయవాలు కావాలన్నా జీవన్ధాన్ పోర్ట్ లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తెలిపారు.శరీర,అవయవదానం చేసేందుకు కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరిగా ఉండాలన్నారు.శరీర, అవయవదానం చేయాలన్న వారు 8790824914 నెంబర్ కు సంప్రదించాలని విజ్ఞప్తి చేశారు. జనవిజ్ఞాన వేదిక జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ ఎంవిఆర్ కృష్ణాజి మాట్లాడుతూ అవయవ దాతల సంఘానికి జన విజ్ఞాన వేదిక తరపున అవసరమైన అన్ని సహకారాలు అందజేస్తామని తెలిపారు.ఇప్పటికే జనవిజ్ఞాన వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ బ్రహ్మారెడ్డి తన మరణానంతరం శరీరాన్ని మెడికల్ కళాశాలకు అప్పగిస్తూ విల్లు రాయడం జరిగిందని, జంపా కృష్ణ కిషోర్ మృతదేహాన్ని విజయవాడ మెడికల్ కళాశాలకు అప్పగించడం జరిగిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.అనంతరం జెవివి తరఫున అవయవదాతల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు తీసుకున్న శివాజీని సత్కరించారు. ఈ కార్యక్రమంలో జేవివి జిల్లా అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు ఎరుకొండ ఆనంద్, డాక్టర్ మిరియాల కృష్ణారావు, పీ.షణ్ముఖరావు,జనార్దనరావు, పాపునాయుడు పాల్గొన్నారు.