
ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరడమే మనందరి లక్ష్యం
వరంగల్ పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్
ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవడమే మనందరి లక్ష్యంగా మార్చుకోవాలని వరంగల్ పోలీస్ కమిషనర్ పిలుపు నిచ్చారు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలను పురస్కరించుకోని నగర ప్రజలకు ట్రాఫిక్ నిబంధనలతో పాటు హెల్మెట్ ప్రాదాన్యతపై అవగాహన కల్పించడం కోసం వరంగల్ ట్రాఫిక్ పోలీసుల అధ్వర్యంలో బైక్ ర్యాలీని ఏర్పాటు చేసారు.ఈ కార్యక్రమానికి వరంగల్ పోలీస్ కమిషనర్ ముఖ్య అతిధిగా హజరయి ర్యాలీ ప్రారంభించిన అనంతరం పోలీస్ కమిషనర్ సైతం అధికారులు,సిబ్బందితో కలసి హెల్మట్లను ధరించి బైక్ ర్యాలీ పాల్గోన్నారు. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరేడ్ మైదానం నుండి ప్రారంభమైన హన్మకొండ చౌరస్తా, ములుగు రోడ్, యం.జి.యం, పోచమ్మమైదానంలోని ఎస్.ఆర్ కళాశాల వరకు కొనసాగింది. అనంతరం విధ్యార్థులతో ఏర్పాటు చేసిన సమావేశంలో పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా ప్రస్తుతం జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు పెద్ద సమస్య మారిందని, ముఖ్యంగా ఈ ప్రమాదాలు వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించక పోవడమే కారణరమవుతోందని. ప్రధానం హత్యలు కన్నా రోడ్డు ప్రమాదాల కారణంగా మరణించిన వారి సంఖ్య అధికమని. పోలీసులు, ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపడితే కొద్ది వరకు రోడ్డు ప్రమాదాలను నివారించగలం కాని వాహనదారులు తమ వ్యక్తిగత బాధ్యతగా భావించి ట్రాఫిక్ నిబంధనలను పాటించడం అవలంబిస్తే ప్రస్తుతం జరిగే రోడ్డు ప్రమాదాలకు చెక్ పెట్టగలమని, గత ఏడాది వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో జరిగిన రొడ్డు ప్రమాదాల కారణంగా 450కు పైగా మృత్యువాత పడ్డారని, అలాగే తోమ్మిడి లక్షల మంది వాహనదారులకు హెల్మెట్ ధరించని కారణంగా జరిమానాలు విధించడం జరిగిందని. ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపటం కారణంగా వాహదారునితో పాటు ఇతరులు సైతం రోడ్డు ప్రమాదాలకు గురవుతున్నారని. ప్రతి వాహన దారుడు హెల్మెట్ ధరించాలని, మైనర్లను వాహనాలను అందజేయవద్దని, కారు నడిపే సమయంలో తప్పని సరిగా సీట్ బెల్ట్ ధరించడంతో ఇతర ట్రాఫిక్ నిబంధనలను పాటిస్తూ సురక్షితంగా మీ ఇండ్లకు చేరుకోవాలని, రోడ్డు భద్రతతో పాటు, ప్రస్తుత రోజుల్లో మత్తుపదార్థాల, సైబర్ నేరాలు సైతం ప్రస్తుతం మనందరి ముందు పెద్ద సమస్యని, యువత మత్తు పదార్థాల జోలికి పోవద్దని, వాటిని వినియోగించడం ద్వారా భవిష్యత్తు అంధకారంగా మారుతుందని, ఎవరైనా మట్తు పదార్థాలు వినియోగించిన, విక్రయించిన పోలీసులకు సమచారం ఇవ్వాలని, అలాగే సైబర్ నేరాల పట్ల ప్రతి ఒక్కరు అప్రమత్తం వుందాలని, తప్పుడు ప్రకటనలు, ఉచితాలు, ఉద్యోగాలు, లక్కీడ్రా, డిజిటల్ అరెస్టులను ప్రజలు నమ్మవద్దని, ఎవరైన సైబర్ నేరానికి గురైతే తక్షణమే 1930 నంబర్‌కు సమచారం అందించాలని పోలీస్ కమిషనర్ విద్యార్థులకు సూచించారు.అనంతరం ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తామని విద్యార్థులచే ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమములో ఈస్ట్ జోన్ డిసిపి అంకిత్ కుమార్, వరంగల్ ఏ.ఎస్పీ శుభం, అదనపు డిసిపిలు ప్రభాకర్ రావు,శ్రీనివాస్,సురేష్‌కుమార్, ఏసిపి సత్యనారయణ,ప్రశాంత్ రెడ్డి, సురేంద్ర,నాగయ్య, జాన్ నర్సింహులతో పాటు ట్రాఫిక్ ఇన్స్‌స్పెక్టర్లు సీతారెడ్డి,వెంకన్న,సుజాతతో పాటు నగరానికి చెందిన ఇన్స్‌స్పెక్టర్లు, ఆర్.ఐలు, ఆర్.ఎస్.ఐలు,ఎస్.ఐలు పోలీస్ సిబ్బంది, స్థానిక యువత ఈ ర్యాలీ ఉత్సహంగా పాల్గోన్నారు.