logo

క్రీడా పోటీల పోస్టర్ లను విడుదల చేసిన ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ



సంక్రాంతి సంబరాలు - క్రీడలతో సంప్రదాయ వేడుకలు" క్రీడా పోటీల పోస్టర్ లను విడుదల చేసిన ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ

అనంతపురం, జనవరి 10 :

జిల్లాలో క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించనున్న "సంక్రాంతి సంబరాలు - క్రీడలతో సంప్రదాయ వేడుకలు" క్రీడా పోటీలకు సంబంధించిన పోస్టర్‌ను ఇంచార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ సంబంధిత అధికారులతో కలిసి నగరంలోని తన క్యాంపు కార్యాలయం నందు ఆదివారం విడుదల చేశారు.ఈ సందర్భంగా ఇంచార్జి జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో క్రీడలను ప్రోత్సహించే దిశలో భాగంగా సంక్రాంతి సంబరాలు - క్రీడలతో సంప్రదాయ వేడుకలు" క్రీడా పోటీల ద్వారా యువతలో శారీరక దృఢత్వం, క్రమశిక్షణ, సమన్వయ భావన పెంపొందించేలా చేపట్టడం జరుగుతుందని అన్నారు.ఈ క్రీడా పోటీలు 12-01-2026 తేదీన సోమవారం ఉదయం 8.00 గంటల నుండి అనంతపురం జిల్లా పీటీసీ (PTC) మైదానంలో నిర్వహించనున్నట్లు వారు తెలిపారు. పోటీల వివరాలు ఈ విధంగా ఉన్నాయి:
- తాడాట – మహిళలకు
- తొక్కుడు బిళ్ళ – మహిళలకు
- కర్రసాము - పురుషులకు
- ఎడ్ల పెంకులాట – పురుషులకు
- తాడు లాగుడు – పురుషులు / మహిళలకు
- గాలిపటాలు – పురుషులకు.కావున జిల్లాలోని ఆసక్తి గల క్రీడాకారులు ప్రకటనలో పేర్కొన్న సూచనలను అనుసరించి పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు. ఇతర వివరాలకు 08554-315632 నంబర్‌ను సంప్రదించవలసిందిగా తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా క్రీడా అభివృద్ధి అధికారిణి ఎస్.ఎమ్ మంజుల, జిల్లా సమాచార పౌర సంబంధాల శాఖ అధికారి బాలకొండయ్య, క్రీడా ప్రాధికార సిబ్బంది తదితరులు పాల్గొనరు

0
35 views