logo

కడప మేయర్ పాక సురేష్ - మార్నింగ్ విజిట్*

*కడప మేయర్ - మార్నింగ్ విజిట్*

*కడప మేయర్ మార్నింగ్ విజిట్ లో భాగంగా కడప నగరంలోని 28, 29 ,32 డివిజన్లకు సంబంధించిన పాత మార్కెట్ చుట్టూ పరిసరప్రాంతాలను కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారు మరియు డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి గారు పర్యటించారు...*

*వైఎస్సార్సీపీ 32వ డివిజన్ ఇంచార్జ్ లు సత్తార్, షఫీ, షాబు గార్లు కడప నగర మేయర్ పాక సురేష్ కుమార్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు...*

*పాత మార్కెట్ అనేది కొన్ని వందల సంవత్సరాల నుంచి కడప నగరానికి హృదయం లాంటిది. మార్కెట్ పరిసర ప్రాంతాలలో శానిటేషన్ వ్యవస్థ ను మరియు పడిపోయిన రూమ్ లను మేయర్ గారు సందర్శించారు...*

*దివంగత మహానేత క్రీ. శే వైయస్ రాజశేఖర్ రెడ్డి గారు కడప పాత మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చి దిద్దాలని 2005 వ సంవత్సరం లో నే DPR చేశారు. ఆయన మరణాంతరం స్థానిక వ్యాపారస్తులు అభద్రభావంతో ఉండడం వలన మోడల్ మార్కెట్ ముందుకు సాగలేదు...*

*పాత మార్కెట్ నిత్యం ప్రజలతో రద్దీగా ఉంటుంది కాబట్టి ప్రజలకు ఇబ్బంది కలగ కుండా ఉండేందుకు నైట్ షిఫ్ట్ కార్మికులు మార్కెట్ నందు 4.30 నుండి 8 గంటల వరకూ పనిచేస్తున్నారు . వారిని సాయంత్రం 7 నుండి రాత్రి 11 వరకు పనిచేసి ఉదయానికి మార్కెట్ ను పరిశుభ్రంగా ఉంచేలా చేయాలని MHO రమేష్ గారిని మేయర్ గారు ఆదేశించారు...*

*సంక్రాంతి పండుగ ఉన్నందున డ్రైనేజ్ బ్లాక్ లను క్లీన్ చేయించాలని & చెత్త పాయింట్ లను మార్చి దుర్వాసన లేకుండా 30 మంది కార్మికులతో గ్యాంగ్ వర్క్ ద్వారా మార్కెట్ చుట్టూ శుభ్రం చేయాలని పూజిత్ రెడ్డి ,నాగ సుబ్బయ్య శానిటేషన్ అధికారులకు మేయర్ గారు ఆదేశించారు...*

*పాత మార్కెట్ నందు శిథిలావస్థ కు చేరుకున్న పాత భవనాలన కడప నగర మేయర్ గారు పరిశీలించి వాటిని డెమోలిష్ చేసి నూతన భవన నిర్మాణాల కొరకు ఎస్టిమేషన్ వేపించాలని మరియు నిరుపయోగంగా ఉన్న రూము లను క్లీన్ చేపించి బాడుగలకు ఇవ్వవలసినదిగా రెవెన్యూ అధికారి RO కన్నయ్య గారిని ఆదేశించారు...*

*స్థానిక వ్యాపారస్తుల అసోసియేషన్ నాయకుడు & వైఎస్ఆర్సీపీ నాయకుడు ఫయాజ్ గారు మరియు వ్యాపారస్తులు పలు సమస్యలు మేయర్ గారి దృష్టికి తీసుకురాగా మేయర్ గారు స్పందించి త్వరలోనే పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు .డ్రైనేజ్ సమస్య లేకోకుండా కొత్త కాలువ నిర్మాణానికి ప్రతిపాదనలను రూపొందించాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు..*

*అనంతరం వ్యాపారస్తులకు మీ సహకారం కూడా ఉంటేనే శానిటేషన్ సమస్యలు లేకుండా మార్కెట్ శుభ్రంగా ఉంటుందని తెలిపారు..*

*వైఎస్ఆర్సిపి నాయకులు మాజీ మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మియ్యా గారి ఆధ్వర్యం లోనాయకులు ఫయాజ్ , ఫైరోజ్ , అర్షద్ లు మేయర్ గారిని మరియు డిప్యూటీ మేయర్ గార్లను సన్మానించారు...*

*ఈ మార్నింగ్ విజిట్ కార్యక్రమంలో వైఎస్ఆర్సిపి కార్పొరేటర్లు & డివిజన్ ఇన్చార్జిలు శ్రీ రంజన్ రెడ్డి, డిష్ జిలానీ ,షఫీ, చాక్లెట్ గౌస్ ,షంషీర్ గార్లు , జిల్లా స్టూడెంట్ విభాగ అధ్యక్షుడు సాయి దత్త గారు ,వైఎస్ఆర్సిపి రాష్ట్ర జిల్లా నగర మైనార్టీ నాయకులు కరీముల్లా, జమీల్,జిలాన్ నాయకులు కార్యకర్తలు రెవిన్యూ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు...*

0
58 views