logo

కొత్తకోట శివాలయంలో సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ ప్రారంభం


రావికమతం మండల బీజేపీ ఆధ్వర్యంలో భక్తిపూర్వకంగా ఓంకార జపాలు ప్రధానమంత్రి విజన్‌ అమలుకు సంకల్పం
అనకాపల్లి జిల్లా రావికమతం మండలం కొత్తకోట గ్రామంలోని పురాతన శ్రీ శివాలయంలో శనివారం "సోమనాథ్ స్వాభిమాన్ పర్వ్ – 2026" కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఘజ్ని మహమూద్ సోమనాథ్ ఆలయంపై దాడి చేసిన 1,000 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ మరియు జిల్లా ప్రెసిడెంట్ డీ పరమేశ్వరరావు ,పిలుపు మేరకు శివాలయాలలో ఓంకార మంత్ర జపాలు నిర్వహించాలనే కార్యాచరణలో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది.రావికమతం మండల బీజేపీ అధ్యక్షుడు, మేడివాడ కోఆపరేటివ్ సొసైటీ చైర్మన్ గూటాల చిన్న సమక్షంలో ఈ పూజ నిర్వహించారు. కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి దంట్ల సత్యనారాయణ కొమరోలు నీటి సంఘం వైస్‌ప్రెసిడెంట్‌, గ్రామ బీజేపీ అధ్యక్షుడు వేపా కిశోర్ చందు తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సోమనాథ్ పునరుద్ధరణకు 75 సంవత్సరాలు పూర్తవుతున్న ఈ సందర్భంగా, ఆలయ అఖండ వైభవాన్ని స్మరించుకుంటూ దేశవ్యాప్తంగా ఓంకార జపాలు నిర్వహించడం గర్వకారణమని తెలిపారు. ప్రధాని మోదీ విజన్‌కు అనుగుణంగా గ్రామస్థాయిలో ప్రజాహిత పథకాలు అమలుచేయడంలో బీజేపీ కార్యదర్శులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాల అమలు, గ్రామీణ అభివృద్ధి, పార్టీ కార్యకలాపాల బలోపేతంపై సవివరంగా చర్చ జరిగింది. ఈ కార్యక్రమం రావికమతం,రోలుగుంట మండలాల్లో బీజేపీ బలోపేతానికి ఒక మైలురాయిగా నిలుస్తుందని గూటాల చిన్న తెలిపారు.

23
1563 views