
ప్రిన్సిపాల్ ఖాదర్ హుస్సేన్ -ఫిజికల్ డైరెక్టర్ లను తక్షణమే సస్పెండ్ చేయాలి.
గోస్పాడు (AIMA MEDIA ): గోస్పాడు ఏపీ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ ఖాదర్ హుస్సేన్ ను ఫిజికల్ డైరెక్టర్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని ఎస్సీ ఎస్టీ బిసి మైనార్టీ మహిళా ఐక్య వేదిక నంద్యాల జిల్లా అధ్యక్షురాలు కటికే భాను డిమాండ్ చేశారు. శుక్రవారం గోస్పాడు మోడల్ స్కూల్ ను మహిళా ఐక్య వేదిక జిల్లా అధ్యక్షురాలు కటికే భాను, ఉపాధ్యక్షురాలు ఆకుతోట పద్మావతి లు సందర్శించారు.ఈ సందర్భంగా భాను మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాల్సిన ప్రిన్సిపాల్ తానే సమస్యగా మారారని విద్యార్థుల పట్ల అసభ్యకరంగా మాట్లాడుతూ మానసికంగా వేధిస్తున్నట్లు విద్యార్థులు మహిళా ఐక్య వేదికతో వారి ఆవేదనను వ్యక్తం చేశారని ఆమె తెలిపారు. విద్యార్థులతో మాట్లాడి వారి సమస్య లను అడిగి తెలుసుకోవడం జరిగిందని ఆమె అన్నారు. జిల్లా కలెక్టరు స్పందించి తక్షణమే ప్రిన్సిపాల్ ను ఫిజికల్ డైరెక్టర్ ను విధుల నుండి తొలగించి విచారణ చేపట్టాలని ఆమె డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా ఐక్య వేదిక జిల్లా కలెక్టరు కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం చేపట్టవలసి వస్తుందని తెలిపారు. జిల్లా కలెక్టర్ జిల్లా కలెక్టర్ మోడల్ స్కూల్ ని సందర్శించి విద్యార్థుల సమస్యలను తెలుసుకుని తక్షణమే పరిష్కరించే దిశగా చర్యలు చేపట్టాలని వారు తెలిపారు.