logo

కేటీఆర్ వ్యాఖ్యలపై యువజన కాంగ్రెస్ ఆగ్రహం, దిష్టిబొమ్మ దగ్ధం చేసిన

కామారెడ్డి జిల్లా బాన్సువాడలో
తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, ఇన్చార్జి సయ్యద్ కాలేక్ ఆదేశాల మేరకు, కామారెడ్డి జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి సూచనల మేరకు బాన్సువాడలో యూత్ కాంగ్రెస్ నియోజకవర్గ అధ్యక్షులు సయ్యద్ మన్సూర్ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, సీఎం రేవంత్ రెడ్డిలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన అవమానకర వ్యాఖ్యలను ఖండిస్తూ, కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి వ్యక్తిగత విమర్శలు చేయడం కేటీఆర్కు అలవాటుగా మారిందని, వెంటనే క్షమాపణ చెప్పాలని యువజన కాంగ్రెస్ నాయకులు డిమాండ్ చేశారు.
కామారెడ్డి జిల్లా బాన్సువాడ రిపోర్టర్ షేక్ అమైర్

81
1894 views