logo

కొన్నిసార్లు కన్న కలలే నిజమై గుండెల్ని పిండేస్తాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో

కొన్నిసార్లు కన్న కలలే నిజమై గుండెల్ని పిండేస్తాయి. రంగారెడ్డి జిల్లా శంకర్ పల్లిలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో సూర్యతేజ అనే విద్యార్థి మృతి చెందాడు. చిత్రమేమిటంటే.. మూడు రోజుల క్రితమే తన కుమారుడు ప్రమాదంలో చనిపోయినట్లు తండ్రి అరుణ్ కుమార్‌కు కల వచ్చింది. ఆ పీడకలే ఇప్పుడు నిజమై ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. సుమిత్ అనే మిత్రుడి పుట్టినరోజు వేడుకలు జరుపుకుని తిరిగి వస్తుండగా.. అతివేగం వల్ల కారు చెట్టును ఢీకొట్టింది. ఈ ఘటనలో సుమిత్, నిఖిల్, సూర్యతేజ, రోహిత్ అక్కడికక్కడే మరణించగా.. నక్షత్ర అనే యువతి పరిస్థితి విషమంగా ఉంది.

3
293 views