logo

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం స్వచ్ఛాంధ్రకు మొదటి సైనికులు వారే మంత్రి సవిత

పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమోఘం
స్వచ్ఛాంధ్రకు మొదటి సైనికులు వారే మంత్రి సవిత

సంక్రాంతి పండుగ సందర్భంగా 400 మంది పంచాయతీ కార్మికులకు కానుకలు అందచేసిన మంత్రి సవిత

పెనుకొండ :పారిశుద్ధ్య కార్మికుల సేవలు అమూల్యమైనవని, వారిని గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని రాష్ట్ర మంత్రి సవిత గారు పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా పెనుకొండ క్యాంపు కార్యాలయంలో పారిశుద్ధ్య కార్మికులకు ప్రత్యేక కానుకలు మంత్రి సవిత అందజేసారు.ఈ సందర్భంగా మంత్రి సవిత గారు మాట్లాడుతూ, రాత్రి–పగలు తేడా లేకుండా, ఎండ–వానలు లెక్కచేయకుండా నగరాలు, పట్టణాలు, గ్రామాలను పరిశుభ్రంగా ఉంచుతున్న పారిశుద్ధ్య కార్మికుల సేవలకు ఎంత చెప్పుకున్నా తక్కువే. స్వచ్ఛత పాటించే వారు నిజమైన దేశభక్తులు. పారిశుద్ధ్యం కేవలం ఉద్యోగం కాదు, అది ఒక పవిత్ర సేవ అని అన్నారు. విజయవాడలో వరదల సమయంలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన సేవలు మరువలేనివని గుర్తు చేసిన మంత్రి, “ఆ కష్ట సమయంలో వారు చూపిన అంకితభావాన్ని నేను ప్రత్యక్షంగా చూశాను. వారిని గౌరవించాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉంది అని తెలిపారు.

స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్రలో పారిశుద్ధ్య కార్మికులే తొలి సైనికులు

‘స్వర్ణాంధ్ర – స్వచ్ఛాంధ్ర’ లక్ష్య సాధనలో పారిశుద్ధ్య కార్మికులే మొదటి సైనికులని మంత్రి సవిత స్పష్టం చేశారు. నగరాలు, గ్రామాలు పరిశుభ్రంగా ఉంటేనే పెట్టుబడులు వస్తాయి, పర్యాటకం అభివృద్ధి చెందుతుంది. రాష్ట్ర అభివృద్ధి పారిశుద్ధ్య కార్మికుల కృషిపైనే ఆధారపడి ఉంది అని అన్నారు.

పారిశుద్ధ్య కార్మికుల భద్రతకు సీఎం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టడం వారి సేవలకు సరైన గుర్తింపని కొనియాడారు.

పంచాయతీలకు 16 ట్రాక్టర్ల ప్రారంభం ట్రాక్టర్ నడిపిన మంత్రి సవిత

గ్రామాల్లో చెత్త సేకరణను మరింత సమర్థవంతం చేయడానికి పంచాయతీలకు మంజూరైన 16 ట్రాక్టర్లను మంత్రి సవిత జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం స్వయంగా ఒక ట్రాక్టర్‌ను నడుపుతూ పారిశుద్ధ్య కార్మికుల సేవలను ప్రశంసించారు.ఈ ట్రాక్టర్లు గ్రామాల్లో సేకరించిన చెత్తను చెత్త సంపద కేంద్రాలకు తరలించడానికి ఉపయోగపడతాయని, దీని ద్వారా కార్మికుల పని భారం తగ్గి గ్రామాలు మరింత శుభ్రంగా మారతాయని మంత్రి తెలిపారు. ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాల ద్వారా స్వచ్ఛత లక్ష్యాన్ని సాధిస్తున్నదని అన్నారు.

ఈ కార్యక్రమంలో డీపీఓ సమత గారు, ఆర్డీవో ఆనందరావు గారు, నియోజకవర్గ కూటమి నాయకులు, ఇతర అధికారులు మరియు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

4
68 views