logo

శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీలో ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ విజయవంతం.

పాణ్యం (AIMA MEDIA ): పాణ్యం మండలం నెరవాడ పరిధిలోని శాంతిరాం ఇంజనీరింగ్ కాలేజీ లో కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (CSE) విభాగం మరియు జేఎన్‌టీయూ ఏ – ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ సెంటర్ (FDC) సంయుక్తంగా నిర్వహిస్తున్న ఫ్యాకల్టీ డెవలప్‌మెంట్ ప్రోగ్రామ్ (FDP) నాలుగో రోజు కార్యక్రమం శుక్రవారం విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు మరియు పరిశోధకులు ఉత్సాహంగా పాల్గొన్నారు.ఉదయం సెషన్‌కు ఏబీటెక్ విల్ (ABTech Ville) వ్యవస్థాపకుడు శ్రీ ఏ. భరద్వాజ్ వనరుల వ్యక్తిగా పాల్గొని, ఫస్ట్ ఆర్డర్ లాజిక్, యూనిఫికేషన్, ఫార్వర్డ్ మరియు బ్యాక్‌వర్డ్ చైనింగ్, రెసల్యూషన్ అంశాలపై లోతైన వివరణ ఇచ్చారు. అనంతరం నిర్వహించిన హ్యాండ్స్-ఆన్ సెషన్ ద్వారా పాల్గొన్నవారికి ఆ అంశాలపై ప్రాయోగిక అవగాహన కలిగించారు.మధ్యాహ్న సెషన్‌ను బ్రెయిన్ ఓ విజన్ (Brain O Vision) సంస్థకు చెందిన ఏఐ జనరలిస్ట్ బి. దినేష్ కుమార్ నిర్వహించారు. ఈ సెషన్‌లో స్టాటిస్టికల్ లెర్నింగ్ పద్ధతులు, రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్ వంటి అంశాలపై వివరణ ఇచ్చారు. అదేవిధంగా ఓపెన్‌ఏఐ (OpenAI) ఉపయోగించి డిసిషన్ ట్రీలు మరియు రీఫోర్స్‌మెంట్ లెర్నింగ్‌పై హ్యాండ్స్-ఆన్ సెషన్ నిర్వహించడంతో పాల్గొన్నవారికి ఆధునిక ఏఐ సాంకేతికతలపై విలువైన అనుభవం లభించింది.

6
12 views