logo

"అమెరికా సామ్రాజ్యవాదం నశించాలి: వెనిజులా అధ్యక్షుడి అక్రమ అరెస్టుపై ఎస్ఎఫ్ఐ ఆగ్రహం."

భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో కోట దగ్గర నిరసన కార్యక్రమం తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము మాట్లాడుతూ "అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ అధికారంలోకి వచ్చిన తర్వాత తన యొక్క గుత్తాధిపత్యం ప్రపంచ దేశాల మీద చలాయించడం కోసం వివిధ దేశాల మధ్యన యుద్ధాలకు పాల్పడ్డాడు. అక్కడతో ఆగకుండా ప్రపంచంలో అనేక దేశాల మీద టారిఫ్లని పెంచి వాణిజ్య యుద్ధానికి పాల్పడ్డాడు. ఇప్పటివరకు పరోక్షంగా చేసినటువంటి దాడుల్ని బెదిరింపుల్ని ఇప్పుడు ప్రత్యక్షంగా చేసేటువంటి పరిస్థితికి దిగజారాడు. అందులో భాగంగానే వెనిజులాలో ఉన్నటువంటి ఆయిల్ నిక్షేపాల పైన పెత్తనం చెలాయించడం కోసం వెనిజులా దేశం పై దాడి చేసి ఆ దేశ అధ్యక్షుడిని తన భార్యని అక్రమంగా అరెస్టు చేసి అమెరికాకు తీసుకుపోయినటువంటి పరిస్థితి ఏర్పడింది. సార్వభౌమత్వం కలిగినటువంటి ఒక దేశ అధ్యక్షుడు పైన నార్కోటిక్స్, డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నాడు అని ఆరోపణలతో ఇలా అక్రమ అరెస్టులు చేయడాన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తోంది. అమెరికా ఇదే మొదటి సారి కాదు గతంలో, సద్దాం హుస్సేన్ పైన గాని, గడాఫీ పైన గానీ ఎటువంటి ఆరోపణలు చేసి తన యొక్క పెత్తనాన్ని చెలాయించిందో ఇప్పుడు అదే దాడులకు దిగుతోంది. దీనిని ప్రపంచం లో అనేక దేశాలు ఖండిస్తున్నాయి కానీ భారతదేశం కనీసం ఎటువంటి స్పందన లేదు. అంతేకాకుండా అమెరికా డైరెక్ట్ గా భారతదేశం పైన విపరీతంగా టారిఫ్లు పెంచుతున్నప్పటికీ ఈ దేశం నన్ను సంతృప్తి పరచడం కోసం మాత్రమే ఉంది అని వ్యాఖ్యలు చేస్తున్నప్పటికీ ఈ దేశ ప్రధాని ఎటువంటి ఖండనz చేయకుండా నిస్సిగ్గుగా వ్యవహరిస్తూ అమెరికా అడుగులకు మడుగులొత్తుతూ దేశ సార్వభౌమాధికారాన్ని ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా వ్యవహరించడాన్ని ఎస్ఎఫ్ఐ ఖండిస్తోంది. అమెరికా సామ్రాజ్యవాదం నశించాలని వెనిజుల అధ్యక్షుడిని విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తుంది. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి డి రాము, ఉపాధ్యక్షుడు కె జగదీష్, సహాయ కార్యదర్శులు వంశీ, రూప, రమణ పాల్గొన్నారు.

12
31 views