మాదినేని మహేష్ హత్య కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు..
ఒక ఇన్నోవా వాహనం రెండు మోటర్ సైకిల్లు స్వాధీనం..
మాదినేని మహేష్ హత్య కేసులో ఐదుగురు ముద్దాయిల అరెస్టు..
ఒక ఇన్నోవా వాహనం రెండు మోటర్ సైకిల్లు స్వాధీనం..
ఈ హత్యకు ఆర్థిక లావాదేవలే కారణం...
మీడియా సమావేశంలో డిఎస్పి వివరాలు వెల్లడి..
కొత్తచెరువు మండలం తిప్పాపట్లపల్లి గ్రామానికి చెందిన మాదినేని మహేష్ హత్య కేసులో ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేసి రిమాండ్ కు తరలిస్తున్నట్లు పుట్టపర్తి డిఎస్పి విజయ్ కుమార్ తెలిపారు. శుక్రవారం డిఎస్పీ కార్యాలయంలో పుట్టపర్తి అర్బన్ సిఐ శివాంజనేయులు తో కలిసి డిఎస్పి ఈ కేసు వివరాలను మీడియాకు వెల్లడించారు.
శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మాదినేని మహేష్ హత్య కేసులో జిల్లా ఎస్పీ ఆదేశాలతో, Puttaparthy sub-divisional Police Officer Sri. B.Vijaya Kumar పర్యవేక్షణలో పుట్టపర్తి టౌన్ పోలీసులు ఐదుగురు ముద్దాయిలను అరెస్టు చేయడం జరిగిందన్నారు.
అరెస్టు తేదీ, సమయము, స్తలము వివరాలు :
08.01.2026 తేదీన మద్యహ్నము 02.30 గంటల సమయంలో కొత్తచెరువు – పెనుకొండ రోడ్ పైన, తలమర్ల క్రాస్, శ్రీ చైతన్య స్కూల్ వద్ద పుట్టపర్తి అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ అయిన శ్రీ O. శివాంజనేయులు , ఐదుగురు ముద్దాయిలను పట్టుకొని అరెస్టు చేశారు.
ముద్దాయిల వద్ద నుండి వారి ఐదు మొబైల్ ఫోన్లు, వారు నేరంలో ఉపయోగించిన ఒక ఇన్నోవా వాహనం (AP 02 CC 9009), రెండు మోటార్ సైకిళ్లు (పల్సర్ KA 64 H 4149, స్ప్లెండర్ AP 02 AP 0105) ఒక క్రైమ్ వెపన్ అయిన Iron Pipe, మృతుని యొక్క ఎలక్ట్రిక్ స్కూటీ, స్వాధీనం చేసుకున్నారు.
మృతుని వివరాలు : మాదినేని మహేష్, వయసు 31 సం, తండ్రి లేట్ వెంకటరాముడు, తిప్పాపట్లపల్లి గ్రామం.
ముద్దాయిల వివరాలు
A-1: యలపల మారుతీ ప్రసాద్ రెడ్డి @ తలమర్ల మారుతీ రెడ్డి, వయస్సు 42 సంవత్సరాలు, తలమర్ల గ్రామము, కొత్తచెరువు
మండలము, రియల్ ఎస్టేట్ వ్యాపారి, .
A-2: సాలక్కగారి వంశీ కిషోర్ @ కిషోర్, వయస్సు 41 సంవత్సరాలు, గ్రామము, కొత్తచెరువు మండలము.
MeeSeva ఆన్లైన్ సెంటర్.
A-3: కోటంపల్లి లోకేష్ @ బ్యాంక్ లోకేష్, వయస్సు 31 సంవత్సరాలు, మరకుంట్ల పల్లి గ్రామము, కొత్తచెరువు మండలం, రైతు.
A-4: G. బాలమిత్ర @ బాలు, వయస్సు 31 సంవత్సరాలు, BC కాలనీ, కొత్తచెరువు గ్రామము, అగ్రికల్చర్ స్పేర్స్ మెకానిక్.
A-5: పుట్లూరు అభిషేక్ @ మెకానిక్ అభి, వయస్సు 37 సంవత్సరాలు, నెహ్రూ నగర్, కొత్తచెరువు గ్రామము. టూ వీలర్ మెకానిక్
కేసు వివరాలు : ముద్దాయి మారుతిరెడ్డి, లోకేష్, మృతుడు మహేష్ అందరూ గతంలో కలిసి వుండేవారని, ఆర్థిక లావాదేవీలు చేస్తుండేవారు. ప్రస్తుతము మారుతిరెడ్డి కి, లోకేష్ కు మరియు మృతుడు మహేష్ కు విభేదాలు వచ్చినాయని, ఈ విషయం లో మృతుడు మహేష్, లోకేష్ ఇద్దరు గొడవ పడి, మహేష్, లోకేషును కొట్టినాడని, కొత్తచెరువు PS లో మహేష్ పైన కేసు పెట్టాడు. ఈ విషయం లో 01.01.2026 తేదీ రాత్రి సుమారు 12.30 గంటలకు మృతుడు మహేష్ అతని పై కేసు ఎందుకు పెట్టినారు అని అడుగుదామని ముద్దాయి మారుతి రెడ్డి గెస్ట్ హౌస్ వద్దకు వెళ్ళగా,
అప్పటికే గెస్ట్ హౌస్ లో ఈ కేసు గురించి మాట్లాడుకుంటూ మారుతి రెడ్డి, లోకేష్, వంశీ కిషోర్, బాలమిత్ర మరియు అభిషేక్ అందరూ వుండినారు. మహేష్ అక్కడికి పోగా, వాళ్ళు మహేష్ తో లేని పోనీ వాగ్వివాదానికి దిగి, కొట్టటానికి వెంబడించగా, మహేష్ తన ఎలక్ట్రిక్ బైక్ మీద పారిపోతుండగా, ముద్దాయిలు తన బైకులలో వెంబడించి, హంద్రీనీవా కాలువ వద్ద మృతుడు మహేష్ ను రాయితో, Iron Pipe తో మహేష్ కాళ్లమీద, చేతులమీద, తలమీద కిరాతకంగా కొట్టి హత్య చేసి, ఈ విషయము తెలియకుండా వుంచడానికి మృతుడు మహేష్ యొక్క శవమును, తన ఎలక్ట్రిక్ బైకును, Iron పైప్ ను దుప్పట్లతో కట్టి హంద్రీ నీవ కాలువ లో పడవేసినారు.
ముద్దాయిల క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్
A-1 మారుతి ప్రసాద్ రెడ్డి: 7 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్ No.48 (పుట్టపర్తి అర్బన్ PS).
A-2 వంశీ కిషోర్: 7 క్రిమినల్ కేసులు, రౌడీ షీట్ No.31 (కొత్తచెరువు PS).
A-3 లోకేష్: 2 క్రిమినల్ కేసులు.
A-4 బాలమిత్ర: సహకారం.
A-5 అభిషేక్: సహకారం.
ముగింపు
ఈ కేసులో నేరస్థులను పట్టుకోవడంలో, నేరస్థల పునఃపరిశీలనలో, సాక్ష్యాధారాలను స్వాధీనం చేసుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన పుట్టపర్తి అర్బన్ ఇన్స్పెక్టర్ శ్రీ O. శివాంజనేయులు, SIలు మరియు వారి సిబ్బందిని DSP గారు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో డిఎస్పీ గారితో పాటు సిఐలు శివాంజనేయులు మారుతి శంకర్ పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.