logo

టీటీడీలో సంచలనం..! జంగా కృష్ణమూర్తి గుడ్ బై..!

ఏపీ లో పల్నాడు జిల్లా టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి ఇవాళ అనూహ్యంగా తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ)బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను టీటీడీకి పంపుతున్నట్లు మరో లేఖ విడుదల చేశారు.
ఇందులో తన రాజీనామాకు గల కారణాల్ని కూడా ఆయన వివరించారు. దీంతో ఈ వ్యవహారం ఇప్పుడు పార్టీతో పాటు ప్రభుత్వంలోనూ తీవ్ర కలకలం రేపుతోంది.

రెండు రోజులుగా ఆంధ్రజ్యోతి పత్రికలో తనపై వచ్చిన తప్పుడు కథనాలకు మనస్తాపం చెంది టీటీడీ బోర్డు సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు టీడీపీ నేత జంగా కృష్ణమూర్తి లేఖలో తెలిపారు. గతంలో తనకు కేటాయించిన బాలాజీనగర్ ప్లాట్ నంబర్ 2 ఇప్పటికీ ఖాళీగా ఉందని, దాన్ని తిరిగి కేటాయించాల్సిందిగా సీఎం చంద్రబాబును కోరినట్లు జంగా తెలిపారు. దీంతో చంద్రబాబు బోర్డుకు దీన్ని పంపారని, బోర్డు కూడా దీన్ని ఆమోదించి తీర్మానం చేసినట్లు వెల్లడించారు.

కానీ వాస్తవాన్ని అవాస్తవంగా ప్రచారం చేస్తూ తనపై తప్పుడు కథనాలు రాస్తున్నారని జంగా కృష్ణమూర్తి ఆరోపించారు. తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నట్లు తెలిపారు. నిన్నటి కేబినెట్ భేటీలో వాస్తవాలు తెలుసుకోకుండా బోర్డు నిర్ణయాన్ని రద్దు చేయాలని నిర్ణయించడం బాధాకరమని ఆయన పేర్కొన్నారు. దీనిపైనే ఆయన మనస్తాపం చెంది పదవి వదులుకుంటున్నట్లు పరోక్షంగా జంగా చెప్పుకొచ్చారు. శ్రీవారి సేవ చేసుకునే అవకాశం కల్పించినందుకు సీఎం చంద్రబాబుకు, టీటీడీకి రుణపడి ఉంటానన్నారు. అలాగే స్వామివారికి సేవ చేసుకునే అవకాశం కోల్పోతున్నందుకు శ్రీవారికి క్షమాపణలు కోరారు.

0
46 views